Cbi lodged fir in agusta westland choppers scam

central bureau of investigation, agusta westland, ids infotech

cbi lodged fir in agusta westland choppers scam

agusta-fir.png

Posted: 03/13/2013 02:47 PM IST
Cbi lodged fir in agusta westland choppers scam

sp-tyagi

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ తో 3600 కోట్ల రూపాయల విలువగల హెలికాప్టర్ల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో జరిగిన కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిబిఐ, మాజీ ఛీఫ్ మార్షల్ ఎస్ పి త్యాగి, మరో పన్నెండు మంది మీద కేసు నమోదు చేసారు.  

సిబిఐ ఈ రోజు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో, అంతకు ముందు ప్రాథమిక విచారణలో ఉన్న వాళ్ళు కాక మరో ఇద్దరిని కూడా చేర్చటం విశేషం.  వాళ్ళు, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ బగ్రోడియా సోదరుడు సతీష్ బగ్రోడియా, ఐడిఎస్ ఇన్ఫోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ అగ్రవాల్.  సిబిఐ నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో అవినీతి నిరోధక చట్టం కింద కూడా కూడా కేసు పెట్టారు.

12 బృందాలుగా దర్యాప్తు చేపట్టిన సిబిఐ, ఢిల్లీ, ఎన్ సి ఆర్, చండీఘడ్ లలో ఎస్ పి త్యాగి, ఆయన కజిన్లు, ఐడిఎస్ ఇన్ఫోటెక్, ఆగస్టా వెస్ట్ ల్యాండ్, ఎయిరో మాట్రిక్స్ మొదలైన 14 స్థలాల్లో ఊకుమ్మడి దాడులను నిర్వహించి సాక్ష్యాధారాలను చేజిక్కించుకుంది.  16 రోజుల ప్రాథమిక విచారణ అనంతరం ఆగస్టా వెస్ట్ ల్యాండ్ వ్యవహారంలో 362 కోట్ల రూపాయలు అవినీతి మార్గంలో చేతులు మారాయని తెలుసుకుంది.  నిందితులను పోయిన వారంలో ప్రశ్నించి వివరాలను క్షుణ్ణంగా సేకరించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Opposition parties commented on governor speech
Budget assemblypng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles