Trs declared readiness to move no confidence motion

telangana rashtra samiti, k chandra sekhara rao, no confidence motion, congress party

trs declared readiness to move no confidence motion

no-confidence.png

Posted: 03/12/2013 09:37 AM IST
Trs declared readiness to move no confidence motion

kcr-photoఅవిశ్వాసాన్ని మేమే ప్రతిపాదిస్తాం

ఇప్పటి వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టరేం అని నిలదీయటం, పెడితే మద్దతిస్తాననటం చేసిన తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిన్న ఉన్నట్టుండి ఒక అడుగు ముందుకేసారు.  మేమే అవిశ్వాస ప్రతిపాదిస్తాం అని కెసిఆర్ సవాల్ చేసారు.  

అందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు దీటుగా సమాధానమిచ్చారు.  ముందు నుంచీ అవిశ్వాసం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్న పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ దాన్నే కొనసాగిస్తున్నారు.  ఉప ముఖ్యమంత్రి దామోదర నరసింహ కూడా ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వం అందుకు తయారుగా ఉందనే అన్నారు.  

ఈ ప్రభుత్వాన్ని ఇలా కొనసాగనివ్వమని నిన్న మీడియా సమావేశంలో అన్నారు కెసిఆర్.  అవిశ్వాసం పెట్టటంలో తెదేపా కానీ, వైకాపా కాని ఆలోచనల్లో పడినట్టుగా కనిపించి ధీమాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు తెరాస ప్రకటనతో కాస్త ఖంగుతిన్నట్టే కనిపిస్తున్నారు.  

కానీ సంఖ్యాబలం లేని తెరాస అవిశ్వాస ప్రతిపాదనను ఎలా పెట్టి నెగ్గుతుంది అన్నది ప్రశ్న.  విపక్షాలు ఏకమౌతేనే అది కుదురుతుంది.  కానీ విపక్షాల ఏకమవటం అసాధ్యమేనని కాంగ్రెస్ భావిస్తోంది.  ఎందుకైనా మంచిదని, కాంగ్రెస్ తన పార్టీ సభ్యులకు పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత దండాన్ని కూడా చూపిస్తోంది.  వైకాపాతో తెరాస తెర వెనక ఏమైనా మంతనాలు జరిపిందా అనే అనుమానాలను పలువురు వెలిబుచ్చుతున్నారు.  

పార్టీలకు అతీతంగా తెలంగాణా నేతలకు కెసిఆర్ హామీల వర్షం కూడా కురిపిస్తున్నారు.  అనర్హత వేటు పడినా, సర్కార్ ఎలాగూ పోతుంది కాబట్టి వాళ్ళకి తెరాసలో ప్రముఖమైన స్థానం కలుగుతుందనే సంకేతాలను ఇస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram singh parents request to leave alone
Fire broke at chennai air port caused filghts to devert  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles