Old ramamandiram demolished in srikakulam

ramamandiram demolished in srikakulam, roads and buildings department, srikakulam municipal authorities, bjp and hindu religious organisations, ramamandiram on gt road

old ramamandiram demolished in srikakulam

ramamandiram.gif

Posted: 03/04/2013 11:10 AM IST
Old ramamandiram demolished in srikakulam

old ramamandiram demolished in srikakulam

 శ్రీకాకుళం పట్టణంలోని జిటి రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక ఏడురోడ్ల కూడలి నుండి రామలక్ష్మణ కూడలి వరకు 63 అడుగుల మేర విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి అనంతరం దానిని 60 అడుగుల మేర విస్తరించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. దీనికి 12 కోట్ల రూపాయల నిధులు కేటాయించి రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. ఇదిలా ఉండగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటి నుండి ఒక హోటల్ ఎదురుగా ఉన్న రామాలయం విషయంలో పలు విమర్శలు ఎదురవుతునే ఉన్నాయి. హోటల్ ఎదురుగా ఉన్నందున ఆలయాన్ని తొలగించేందుకు హోటల్ యజమానులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, అందుకే రోడ్డు విస్తరణలో జంతర్‌మంతర్‌గా కొలతలు తీశారని పలువురు పేర్కొంటూనే ఉన్నారు. అందుకే రామాలయం ఎదురుగా ఉన్న మంచినీటి బోరింగ్‌ను హోటల్‌కు, రామాలయానికి మధ్యన సిసి రోడ్డు వేయడానికి తొలగించేశారు. అప్పటినుండే రామాలయం కూడా తొలగించేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

old ramamandiram demolished in srikakulam

అందుకే రోడ్డు విస్తరణలో ఎదురుగా ఉన్న స్థలాన్ని వదిలి రామాలయం మీదుగా ఆరు అడుగుల మేర తొలగింపుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు మార్కింగ్‌ను చేశారని చెబుతున్నారు. అయితే, ఆలయం బరాటం గణపతి అనే ఆయన స్థలంలో ఉందని, ఆయన ఆలయానికి స్థలం అప్పగించారని తెలిసింది. రోడ్డు విస్తరణలో రామాలయాన్ని కూల్చరాదంటూ అతని పేరుతోనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనికి హైకోర్టుకూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పేరుతో రామాలయ తొలగింపుపై మరిన్ని వివరాలు కోరుతూ ఫిబ్రవరి 28న షోకాజ్ నోటీసు జారీచేసింది. దీనిని ఆధారంగా చేసుకొని ధార్మిక పరిషత్ సంస్థలు పలువిధాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కాగా, అది కోర్టు స్టే కాదని, షోకాజ్ నోటీస్ మాత్రమే అని పేర్కొంటూ అధికారులు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దేవాలయాన్ని జెసిబితో పడగొట్టేశారు. దీనిపై వెంటనే స్పందించిన ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆలయం కూల్చివేతపై ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ హోటల్‌కు వత్తాసు పలుకుతూ వారికి లబ్ధి చేకూర్చేందుకే ఆలయాన్ని పడగొట్టారని, లేదంటే తెల్లవారుజామున హుటాహుటిన పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada 2014 election in rajahmundry
Karachi bomb death toll rises to 45  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles