Pope benedict pledges obedience to successor

pope benedict xvi, pope benedict, castel gandolf, pope benedict pledges

pope benedict pledges obedience to successor

pope-benedict.gif

Posted: 02/28/2013 07:52 PM IST
Pope benedict pledges obedience to successor

pope benedict pledges obedience to successor

 పోప్  బెనడిక్ట్  ప్రజలకు  వీడ్కోలు పలికారు.  వాటికన్  నగరంలోని  సెయింట్  పీటర్స్  స్క్వేర్ వద్ద   చివరిసారిగా  ఆయన పోప్  హోదాలో  ప్రజలకు దర్శనమిచ్చారు.  పోప్ ను  సందర్శించుకుని  , చివరిసారిగా  ఆయనకు  వీడ్కోలు  పలికేందుకు  దాదాపు లక్ష మందికి పైగా  యాత్రికులు  తరలి వచ్చారు.  పోప్ పదవికి  రాజీనామా చేయనున్నట్లు  ప్రకటించిన  పోప్ బెనడిక్ట్  , తన బాధ్యతల నుంచి  వైదొలగనున్న సంగతి తెలిసిందే. పోప్  కనిపించగానే  జనం నినాదాలు చేశారు.  పోప్   ఈ  సందర్భంగా  ప్రజలను  ఉద్దేశించి  మాట్లాడుతూ.. పోప్ గా  తన పాలనా  కాలాన్ని, బైబిల్ లో  అభివర్ణించిన  ఒక అద్భుతంగా  పరిపోల్చారు.   మత్స్యకారుడైన  సెయింట్  పీటర్స్ సహా  జీసస్  తన శిష్యులతో  కలసి   పడవలో   ప్రయాణిస్తున్నప్పుడు  నీటి  ప్రవాహాన్ని  ప్రశాంతపరిచిన   ఉదంతాన్ని  గుర్తు చేశారు.  రాజీనామా  చేయాలని  తేలికగా నిర్ణయం తీసుకోలేదని,  చర్చి మేలు  కోసమే, అన్ని పర్యవసానాలను  ఆలోచించే  తాను ఈ నిర్ణయం  తీసుకున్నానని  వివరించారు.  అయితే, తన ప్రార్థనల ద్వారా చర్చితో  అనుబంధాన్ని  కొనసాగిస్తానని  చెప్పారు.  పోప్ ను  సందర్శించుకునేందుకు  తరలి వచ్చిన  వారిలో  పలువురు క్రైసత్తవ మత గురువులు , సన్యాసినులు  కూడా ఉన్నారు.  భావోద్వేగానికి గురైన  పలువురు  యాత్రికులు  పోప్ వర్థిల్లాలి అంటూ  నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indias big leap into space launches worlds first smart phone
Worlds oldest woman 114 year old woman crowned in japan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles