Augusta scam probed to be monitered by jpc

agusta westland scam, joint parliamentary committee, aurn jaitley

augusta scam probed to be monitered by jpc

joint-parliamentory-committ.png

Posted: 02/28/2013 09:40 AM IST
Augusta scam probed to be monitered by jpc

arun-jaitley

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) నిర్వహించటానికి రాజ్యసభలో పెట్టిన ప్రభుత్వ ప్రతిపాదన నమోదయింది.  ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాలన్నీ ఏకకంఠంతో నిరసిస్తూ సభను బహిష్కరిస్తూ పార్లమెంటుని వదిలి వెళ్ళిపోయాయి.  అయితే ప్రతిపాదన ఆగలేదు.  మిగిలి వున్నవారితో వాయిస్ వోట్ తో పాసయింది.  దాన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెడతారు. 

పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి కమలనాథ్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలన్నీ ఆందోళనకు దిగిన సందర్భంలో, ఇదంతా తప్పుదోవ పట్టించే తెలివితేటలు.  జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దర్యాప్తు చేసే హక్కులు లేవు.  నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తుని నిర్వహించవలసి ఉంటుంది.  ఆపని జెపిసి కి సాధ్యం కాని పని అన్నారు ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ.   ఇటాలియన్ ప్రభుత్వం లంచం ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసింది.  కానీ అతనెవరన్నది బయటపడకుండా ప్రభుత్వం పెదవి విప్పకుండా గోప్యతను పాటిస్తోంది.  ఆ వ్యక్తి ఎవరో కచ్చితంగా కానీ భారతీయుడే అయ్యుంటాడు.  దాని విచారణ ఇక్కడ జరగాలి కానీ ఇటలీ మీద, బ్రిటన్ మీద ఆధారపడటంలో అర్థం లేదు.  ఆ మనిషిని ఆ దేశ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత 367 రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ప్రాథమిక విచారణంటూ కేసుని సిబిఐకి అప్పజెప్పటం, జెపిసి దర్యాప్తు చేస్తుందనటం హాస్పాస్పదం అంటారు జైట్లీ. 

జెపిసి ఆధ్వర్యంలో విచారణను సిబిఐ నిర్వహిస్తుందట.  దర్యప్తు సాగుతున్న నేపథ్యంలో వివరాలను బయటకు తెల్పటం కుదరదని ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇక్కడేమో సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. 

సిబిఐ చేసే దర్యాప్తును సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరగాలా లేక పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలోనా అన్న దానిలో సభ్యులలో విభజన జరిగింది.  సిపిఐ కి చెందిన డి.రాజా, ప్రతిపక్షమంతా బహిష్కరించిన సభలో నిర్ణయాలు తీసుకోవటం సరైనది కాదని చేసిన అభ్యంతరాన్ని, రాజ్య సభ సహాయ సభాపతి తోసిపుచ్చారు.

10 మంది రాజ్య సభ సభ్యులు, 20 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆగస్టా కుంభకోణానికి చెందిన దర్యాప్తుని నిర్వహించటానికి రాజ్యసభలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A k antony does not want to resign now
Meerja abdul wounded in two bomb incidents  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles