Dl ravindra reddy vs mla veera siva rddy

kamalapuram mla g veera siva reddy, health minister d l ravindra reddy, congress party leaders, dl ravindra reddy vs mla veera siva rddy, ysr congress party,

dl ravindra reddy vs mla veera siva rddy

dl-ravindra-reddy.gif

Posted: 02/27/2013 03:44 PM IST
Dl ravindra reddy vs mla veera siva rddy

dl ravindra reddy  vs mla veera siva rddy

కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోసారి సొంత పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ జిల్లా సహకార ఎన్నికల్లో, ఆప్కో చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు డీఎల్ ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని వీరశివారెడ్డి ఆరోపించారు. టీడీపీకి చెందిన గజ్జెల శ్రీనివాస్‑తో ఆప్కో ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయించి పార్టీ అభ్యర్థి హనుమంతరావును ఓడించాలని చూశారని అన్నారు. డీఎల్‑ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. మరోమంత్రి సి.రామచంద్రయ్య కూడా డీఎల్‑కు సహకరించారన్నారు. రామచంద్రయపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కూడా డీఎల్ పై విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రత్యర్థులతో కుమ్మక్కు అయిన డీఎల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, మంత్రి సి.రామచంద్రయ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాలంలో రూ.2వేల కోట్లు సంపాదించిన డీఎల్‌ను కేబినెట్‌ నుంచి తప్పించాలని వరదరాజులు రెడ్డి కోరారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఖండించారు. తాను మొదటి నుంచి సహకార సంఘాల ఎన్నికలకు దూరంగా ఉన్నానని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తాను పట్టించుకోనని డీఎల్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి డీఎల్ రవీంద్రారెడ్డే‑ కారణమని ఆపార్టీ నేతలు వీరశివారెడ్డి, వరదరాజులు రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pre budget survey suggests subsidy cuts
Anubhuti coach on rajdhani and shatabdi express trains bansal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles