ఉత్తమ సౌకర్యవంతమైన ప్రయాణానికి ‘అనుభూత’ పేరిట కొత్త కోచ్ ను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఈ తరహా సౌకర్యాలు ప్రస్తుతం రాజధాని, శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ‘అనుభూతి’లో ప్రయాణపు ఛార్జీలు దానికి తగ్గట్టుగానే ఉంటాయని రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రాజధాని, శతాభ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. అంటే సౌకర్యవంతమైన ప్రయాణానికి మక్కువ చేసే ప్రయాణికులు ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో అనుభూతి కోచ్ ను ప్రవేశపెడతాము. ఈ కోచ్ లలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు అధ్బుతమైన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఎంపిక చేసిన రైళ్లలో ఒక పైలట్ ప్రాజెక్టు ను త్వరలో ప్రారంభించనున్నాయి. దీని ద్వారా రైలు సిబ్బందికి ప్రయాణికులు ఎస్ఎంఎస్ లేదా ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు. రైల్వే భోగీలు అపరిశుభ్రంగా ఉన్నా, ఇతర అసౌకర్యాల గురించి వారికి తెలియజేయవచ్చు. రాబోయే స్టేషన్లు, ఏ ప్లాట్ ఫారం పై రైలు ఆగుతుంది. మొదలైన వివరాలను రైల్లో ప్రయాణిస్తున్న వారు తెలుసుకునేందుకు వీలుగా ఎనౌన్స్ మెంట్ , ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డులు , అన్ని అందుబాటులో ఉంటాయాని రైల్వే మంత్రి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more