Rajeev pratap rudy spokesman of bjp calls hagels remarks bizarre

rajeev pratap rudy spokesman of bjp calls hagels remarks bizarre

hagel-remarks.png

Posted: 02/27/2013 02:49 PM IST
Rajeev pratap rudy spokesman of bjp calls hagels remarks bizarre

chuck-hagel

అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేసిన డిఫెన్స్ సెక్రటరీ చక్ హాగెల్ 2011 లో భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు పోయిన వారంలో బయటకు వచ్చాయి.  ఓక్లహోమాలోని కేమెరాన్ విశ్వవిద్యాలయంలో హాగెల్ ఇచ్చిన ప్రసంగం బాపతు వీడియో తాజాగా బయటకు వచ్చి సంచలనాన్ని రేపింది. 

నెబ్రాస్కాలో సెనేటర్ గా పని చేస్తున్న సమయంలో హాగెల్ చేసిన ప్రసంగంలో, భారత్ పెట్టుబడి పెట్టి మరీ, పాకిస్తాన్ కి సమస్యలను కొనితెచ్చిందని అన్నారు.  పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లకు మధ్యనున్న రచ్చ, అందులో భారత పాత్ర గురించి ఆరోజు మాట్లాడారాయన.  భారత్ ఆఫ్గనిస్తాన్ ని తన ప్రతిరూపంగా వాడుకుంటూ పాకిస్తాన్ కి మరోవైపున్న సరిహద్దులో సమస్యను తెచ్చిపడుతోంది అని ఆయన అన్నారు.  ఆయన తన మాటల్లో ఇంకా, పాకిస్తాన్ ని  సమర్థించటం జరిగింది. 

ఆ మాటలకు తీవ్రంగా స్పందించిన భాజపా అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ, ఆ ఆరోపణలు నిరాధారం, అర్థరహితం అంటూ విరుచుకుపడ్డారు.  బేషరతుగా ఆ మాటలను ఉపసంహరించుకోమని వాషింగ్టన్ మీద ఒత్తిడి తేవలసిందిగా భాజపా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.  వర్ల్ డ్ ట్రేడ్ సెంటర్ ని పేల్చి, 5000 కి పైగా అమెరికన్లను పొట్టనబెట్టుకున్న

ఒసామా బిన్ లాడెన్ కి ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ గురించా అలా మాట్లాడేదంటూ రాజీవ్ విస్మయాన్ని ప్రకటించారు. 

ఒబామా కార్యాలయం నిజానికి ఆఫ్గనిస్తాన్ లో భారత్ పాత్రను ఎప్పుడూ కొనియాడుతూ వస్తోంది.    హాగెల్ ఎప్పుడూ భారత్, అమెరికాల మధ్య మైత్రికే మొగ్గు చూపించేవాడని, ఆఫ్గనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం భారత్ పాటుపడుతుందన్నది సత్యమని అమెరికన్ ఎంబసీ నుంచి వ్యాఖ్యలు వచ్చాయి.  ఆఫ్గనిస్తాన్ సుస్థిరంగా పురోభివృద్ధిలో వెలుగొందాలని భారత ఆకాంక్ష అన్న దానిలో ఎటువంటి సందేహమూ లేదని కూడా ఎంబసీ నుంచి పేరు ప్రకటించని అధికారి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Isro chairman radha krishna
Last budget for congress says chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles