Milk adulteration in large scale caught by task force

milk, milk products, milk dairies, milk adulteration, task force

milk adulteration in large scale caught by task force.

adulterated-milk.png

Posted: 02/20/2013 12:45 PM IST
Milk adulteration in large scale caught by task force

     వేలాది లీటర్ల పాల వినియోగం చేసే నగర వాసుల ఆరోగ్య దృష్ట్యా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటం కోసం పాలలోంచి వెన్నను ముందే తీసేసి, అలా తీసేసిన సంగతి తెలిస్తే మానసిక క్షోభని అనుభవిస్తారేమో నన్న భయంతో వాటిలో పాలపొడి, రసాయనాలను కలిపి మరీ కొందరు ప్రబుద్ధలు సప్లై చేస్తున్నారు.  అవి కాస్తా హోటళ్ళలోకి, టీ బడ్డీలలోకి, మిఠాయి దుకాణాలలోకి పోయి రసాయన మయం చేస్తున్నాయి. 

     సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో కెఎమ్ బి గ్రూప్ కంపెనీలో రహస్యంగా జరుగుతున్న ఈ తంతు టాస్క్ ఫోర్స్క్ కి దొరికిపోయింది.  దాడి చేసిన సమయంలో దొరికిన ఆధారాల మీద దర్యాప్తు జరుగుతోంది.  ఈ విషయం బయటకు పొక్కగానే ఇటు నగర వాసులు, అటు ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కూడా షాక్ కి గురయ్యారు.  టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆనంద్ ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అదువులోకి తీసుకున్నారు.

    ఎన్నో సంవత్సరాల నుంచీ జరుగుతున్నా మొద్దు నిద్రలో ఉన్న ఫుడ్ ఇన్స్ పెక్టర్లు ఈ సంఘటనకు అదాటుగా లేచి ఆవులిస్తూ, హడావిడిగా కల్తీ జరుగుతోందని తెలిసిన దుకాణదారులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అయితే, పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తూనేవున్నాంగా అంటారు ఆ పాల కేంద్ర యజమానులు అమాయకంగా.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac and supports geared up for sadak bund
Ak anotni shocked to know about agusta affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles