Senior leaders fire on sharmila

v hanumatha rao, congress party senior leader, vhr, ysr congress party, ysrcp, ys jagan, ys sharmila, sharmila padayatra, sonia gandhi, rahul gandi, bjp leader prabhakar comments

senior leaders fire on sharmila

senior-eaders-fire-on-sharmila.gif

Posted: 02/17/2013 02:00 PM IST
Senior leaders fire on sharmila

senior leaders fire on sharmila

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సోదరి  షర్మిల రాష్ట్రంలో  పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  సెకండ్ విన్నింగ్  ఓపెన్ చేసిన షర్మిల,  రాజకీయ ప్రత్యర్థులపై మంచి పట్టుతో వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలోను ఉతికి పారేస్తుంది.  అయితే  షర్మిల్ పై ముదురునేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.  సోనియాగాంధీ,  రాహుల్ లను  విమర్శించే  హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నేత అయిన షర్మిలకు లేదని   కాంగ్రెస్ సీనియర్  నేత వి. హనుమంతరావు  అంటున్నారు.  నిత్యం ప్రజా  సంక్షేమం గురించి  ఆలోచించే  సోనియా, రాహుల్ లను  విమర్శిస్తే  ప్రజలు ఆమెకు తగిన విధంగా గుణపాఠం  చెబుతారని అన్నారు.  కాంగ్రెస్  పార్టీ నేతలు కూడా  ప్రజల్లోకి  వెళ్లాలని, ఇందు  కోసం  అవసరమైతే  పార్టీ సమావేశం  నిర్వహించి  ప్రణాళిక రూపోందించాలని  ఆయన అభిప్రాయపడ్డారు.

senior leaders fire on sharmila

అక్రమాస్తులపై  తాము చేసిన ఆరోపణలపై  వైఎస్ఆర్ కాంగ్రెస్  నేత  షర్మిల  ఎందుకు స్పందించడం లేదని  బాజాపా నేత  ప్రభాకర్ రెడ్డి  ప్రశ్నించారు. విశ్వసనీయత  గురించి  మాట్లాడే జగన్, షర్మిల  ఎందుకు నోరు మెదపడం లేదని  ఆయన అడిగారు. తాము బయటపెట్టిన  అంశాలు  వాస్తవం  కాబట్టే  జగన్, షర్మిల  స్పందించడం లేదని  అన్నారు.  వైఎస్  హయాంలో   సేకరించిన  భూముల్లో   ఇప్పటికీ  సెజ్ లు  రాలేదని  చెప్పారు.  పాదయాత్ర  సమయంలో   భూములను గుర్తించిన  వైఎస్ అధికారంలోకి రాగానే వాటిని  సేకరించారని  ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman cheated by sms loses rs 7 lakhs
Arasavalli stampede devotees difficulties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles