Congress high command call governor narasimhan

governor narasimhan, call from congress high command, to discuss about the telangana issue, governor meeting with sonia gandhi, antoni, shinde

governor narasimhan, call from congress high command, to discuss about the telangana issue, governor meeting with sonia gandhi, antoni, shinde

Congress high command call Governor Narasimhan.png

Posted: 02/05/2013 12:46 PM IST
Congress high command call governor narasimhan

kiran-sonia-Narasimhan

కాంగ్రెస్ అధిష్టానం అఖిలపక్ష భేటి తరువాత పెట్టిన గడువు కూడా దాటవేసి, తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, మరిన్ని చర్చలు అవసరం, చర్చల ప్రక్రియ నడుస్తుంది అంటూ ప్రకటనలు చేస్తూనే మరో వైపు తెలంగాణ అంశాన్ని సీరియస్ గా పరిశీలించుచున్నట్లు తెలుస్తుంది. నిన్న ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం ఆయన చర్చల మీద చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే రాష్ట్ర గవర్నర్ కు ఫోన్ చేసి పిలిచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్రపతి ప్రణబ్, సోనియాగాంధీ,రాహుల్ గాందీ, అజాద్ తదితరులతో చర్చలు జరిపారు.తెలంగాణపై తన అబిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే మరిన్ని చిక్కులు వస్తాయని, అవి పరిష్కారం చేయడం మరింత కష్టం అవుతుందని ఆయన వాదించారని చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రాజకీయంగా ఏది ఉపయోగం, ఏది కాదు..అన్నదానిపై అదిష్టానం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రేపో మాపో పీసీసీ అధ్యక్షుడు బొత్పను కూడా ఢిల్లీకి రావాలని పిలుపు అందవచ్చని అంటున్నారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉఠ్కంటంగా ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chintalapudi maddala rajesh met jagan
Minister vatti vs chairman fight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles