రైళ్ళలో ప్రయాణికులకు, ప్రయాణికుల సామాన్లకు భధ్రత కల్పించడంలో ఫూర్తిగా విఫలం అయిన రైల్వేశాఖ చివరకు రాజకీయ నాయకులకు కూడా భధ్రత కల్పించలేక పోతుంది. సాక్ష్యాత్తు ఓ ఎమ్మెల్యేకి, ఆయన భార్యకి రైళ్ళో అల్లరిమూకల ద్వారా పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.... బిజేపీ ఎమ్మెల్యే శివేష్‌కుమార్ దంపతులు ఓ వివాహ వేడేకకు హాజరైయ్యేందుకు ఆరు నెలల చిన్నారి తో కలిసి పాట్నా జంక్షన్‌లో దానాపూర్-హౌరా(సంపూర్ణ క్రాంతి) ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఇదే కోచ్‌లోకి 17మంది రైల్వే టీటీఈలు, ఇతర సిబ్బంది ఎక్కారు. వీరు ఎమ్మెల్యే భార్యతో అమర్యాదగా, అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించారు. అలా చేయొద్దని ఎమ్మెల్యే భార్య కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన వాళ్ళను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యేపై అల్లరిమూక దాడి చేసింది. దీంతో ఆరు నెలల చిన్నారితో సహా దంపతులిద్దరూ గాయపడ్డారు. శివేష్ కుమార్ పోలీసులతో చెబుతూ... నా భార్యపై వాళ్లు విస్కీ పోశారు. ఆమెను లాగేశారు. దుర్భాషలాడుతూ ఒక జంటను చంపేస్తున్నామని ఎవరికో వాళ్లు ఫోన్ చేసి చెప్పారు. ఎలాగోలా నేను రైలు చైను లాగాను'' అని శివేష్‌కుమార్ పేర్కొన్నారు. "రైలును ఆపడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. నా భార్య ఎలాగొలాగా మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. దీంతో కొంత మంది పోలీసు సిబ్బంది వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే భార్యపై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం జరిగిందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more