Brazil nightclub fire kills 245

Brazil nightclub, kiss club, Brazil nightclub fire kills 245,Brazil nightclub fire

Brazil nightclub fire kills 245

Brazil nightclub.gif

Posted: 01/28/2013 01:40 PM IST
Brazil nightclub fire kills 245

Brazil nightclub fire kills 245

బ్రెజిల్ లోని ఓ నైట్  క్లబ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 245 మంది ప్రానాలు  కోల్పోయినట్లు  స్థానిక అధికారుల తెలిపారు. జనంతో కిక్కిరిసిన ‘కిస్ క్లబ్’లో వేకువ జామున రెండు గంటల సమయంలో ఆకస్మికంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 245 మంది మృత్యువాత పడ్డారు. 131 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతులంతా విద్యార్థులే కావడం గుండెను పిండేసే విషాదం.  ‘కిస్ క్లబ్’లో యూనివర్సిటీ విద్యార్థుల పార్టీ జరుగుతుండగా ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. క్లబ్ అంతా అగ్నికీలలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పరిగెత్తారు. బయటకు వెళ్లేందుకు ఒకే ఒక ద్వారం ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది పొగతో ఊపిరాడక, కొందరు తొక్కిసలాటలో మరణించారు.

Brazil nightclub fire kills 245

అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు. అయితే, పార్టీలో పైరోటెక్నిక్స్(జ్వాలా విన్యాసాలు)తో కూడిన రాక్ బ్యాండ్ సంగీత కార్యక్రమం జరుగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ‘కిస్ క్లబ్’ ఘోరకలితో బ్రెజిల్ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ‘ఇది విచారకరమైన ఆదివారం’ అంటూ ట్విట్టర్‌లో సంతాప సందేశాలు ఉంచారు. ప్రమాదం నేపథ్యంలో దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ చిలీ పర్యటనను కుదించుకుని హుటాహుటిన స్వదేశానికి తిరిగి వచ్చారు. పర్యటనల కంటే బ్రెజిల్ప్రజలే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయమందించాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 years babygif
Shinde and telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles