Police may again appeal akbar remand

kbaruddin owaisi, nirmal, adilabad, hindu

It is said that Adilabad district police may again appeal in the district court for MIMLP Akbaruddin Owaisi's remand

police may again appeal akbar remand.png

Posted: 01/16/2013 01:44 PM IST
Police may again appeal akbar remand

akbarహిందువుల పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని విచారణ నిమిత్తం ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి విచారణ జరుపుతున్న పోలీసులు మరో రోజు విచారణ మిగిలి ఉండగానే ఇవాళ ఉదయం అతనిని నిర్మల్ కోర్టు ఎదుట హాజరు పర్చారు. దీంతో న్యాయమూర్తి అతనిని భారీ బందోబస్తు మధ్య అదిలాబాద్ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అతనిని జైలుకు తరలించారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల కస్టడీలో వారికి ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. స్టడీలో అక్బర్ నుండి పూర్తి సహకారం లేదనందున ఆయన శ్యాంపిల్స్ ఛండీగఢ్‌కు పంపి, రిపోర్ట్స్ వచ్చాక తిరిగి మరోసారి అక్బరుద్దీన్ కస్టడీని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న సిడిల్లోని గొంతు తనది కాదని అతను పోలీసులకు చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశమే ప్రధానమైనదని కావడంతో పోలీసులు అతని గొంతేనా కాదా తేల్చుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అక్బరుద్దీన్ తనను ప్రత్యేక ఖైధీగా గుర్తించాలని, అనారోగ్యం కారణంగా కార్పోరేట్ వైద్యం అందించాలని కోర్టులో విన్నవించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Haryana ex cm chautala arrested
Chandrababu questions ysrcp signature  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles