Minister kondru murali fires on sakshi paper

minister kondru murali , minister, kondru murali fired on jagan sakshi media, sakshi paper, ys jagan, telangana issue, sonia gandhi , delhi leaders, samakya andhra, telangana,

minister kondru murali fires on sakshi paper

minister kondru murali.gif

Posted: 01/12/2013 12:35 PM IST
Minister kondru murali fires on sakshi paper

minister kondru murali fires on sakshi paper

వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పత్రికైన సాక్షి పై కాంగ్రెస్ మంత్రి నిప్పులు కురిపించారు.  నేను విలేకరుల సమావేశం పెట్టినట్టు జగన్ పత్రిక నిరూపించగలదా? అని వైద్య విద్యా మంత్రి కోండ్రు మురళి సవాల్ చేశారు. అదో బూతు పత్రికగా ఆయన అభివర్ణించారు. తాను విలేకరుల సమావేశం పెట్టకపోయినా.. పెట్టానని, తెలంగాణకు అనుకూలమని ప్రకటించానని జగన్ దినపత్రిక ప్రచురించడం దారుణమన్నారు. తాను సమైక్యవాదినని స్పష్టం చేశారు. జగన్ పత్రిక తనపై కక్ష కట్టినట్టు ఉందన్నారు. ఆ పత్రికా కథనాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అసలు తాను విలేకరుల సమావేశం పెట్టినట్టు ఆ వార్త రాసిన విలేకరి గానీ, జగన్ పత్రిక గానీ నిరూపించగలదా అని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణ అంశం అధిష్ఠానం చేతిలో ఉందని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తగా దాన్ని స్వాగతిస్తానన్నారు. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు కథనాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. కాగా, రాంకీ సంస్థకు చెందిన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేయడాన్ని కూడా జగన్ పత్రిక అనుకూలంగా రాసుకుంటుందని మంత్రి చెప్పారు. రాంకీ నష్టాల్లో ఉందని సాక్షిలో కథనం ప్రచురించడం హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఎకరాకు 3 లక్షలు ఇచ్చి రైతుల నుంచి తీసుకున్న భూములు ఇప్పుడు అమ్ముకుంటే కోట్లలో మిగులుతుందన్నారు. దీన్ని తాను నిరూపిస్తానన్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla vishnuvardhan reddy attack on power sub station
Suman rathod mla police custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles