Komatireddy venkat reddy sensational comments on chiranjeevi

nalgonda mla komatireddy venkat reddy,komatireddy venkat reddy, congress mla, tourism minister chiranjeevi, minister chiranjeevi, housing minister uttam kumar reddy, uttam kumar reddy, komatireddy venkat reddy sensational comments on chiranjeevi

Komatireddy Venkat Reddy Sensational Comments on Chiranjeevi

komatireddy venkat reddy.gif

Posted: 01/02/2013 06:55 PM IST
Komatireddy venkat reddy sensational comments on chiranjeevi

Komatireddy-Venkat-Reddy

తెలంగాణ కోసం తన మంత్రి పదవిని రాజీనామా చేసిన  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మాటల యుద్దం చేస్తున్నారు.  ఆయన స్థానంలో  మంత్రిగా  ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే.  ఇప్పడు ఉత్తమ్ కుమార్ పై కోమటిరెడ్డి మాటల దాడి చేస్తున్నారు. అంతేకాకుండా  కేంద్ర మంత్రి చిరంజీవి పై కోమటిరెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకు పడ్డారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంస్కారహీనుడని, పదవి కోసం పార్టీని అమ్ముకున్న ఘనత చిరంజీవిదేనని కోమటిరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఇసుక దందాలు, పేకాట క్లబ్‌లను ఉత్తమ్‌రెడ్డి నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్‌రెడ్డి ఎక్కడా గెలవలేరని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఇక చిరంజీవి కూతురు ఇంట్లో 80 కోట్ల రూపాయలు దొరికితే సోనియా కాళ్లు పట్టుకున్నారని.. దాంతో ఆ వ్యవహారంలో కేసు లేకుండా చిరంజీవి తప్పించుకున్నారని కోమటిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల ఖర్చుపై సీబీఐతో విచారణ చేపట్టాలని.. ఒకవేళ సీఎం కిరణ్‌ స్పందించకుంటే సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తానని కోమటిరెడ్డి హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nannapaneni rajakumari attacks subhash patriji
Tamil nadu governor k rosaiah speech in college  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles