Kasani gyaneshwar to join jagan party

former MLC Kasani Gyaneshwar, Kasani Gyaneshwar , Y S Jaganmohan Reddy, YSR Congress party,

former MLC Kasani Gyaneshwar to meet YSR Congress party president Y S Jaganmohan Reddy and announce his entry into the party.

Kasani Gyaneshwar To Join Jagan Party.png

Posted: 12/15/2012 12:05 PM IST
Kasani gyaneshwar to join jagan party

Kasaniమాజీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కాసాని జ్ఞానేశ్వర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆయన చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ని కలిసారు. అనతరం మాట్లాడుతూ... ప్రజా సమస్యల పై పోరాడటానికి జగన్ కి అండగా నిలుస్తానని, వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రజలు మరచిపోలేక పోతున్నారని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగన్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు మూడు రోజుల్లో రానున్నదని సమాచారం. ఈయన గతంలో సొంతంగా ‘మన పార్టీ ’ పేరుతో  ఓ రాజకీయ  పార్టీని స్థాపించి  ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తరువాత కొంతకాలం టీడీపీకి దగ్గరైనప్పటికీ... వైఎస్ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. ఇక తన వంతుగా ముదిరాజ్ లను ఏకతాటి పై నడిపించడానికి సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఈ పార్టీలో ఎన్నిరోజులు ఉంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Connecticut school shooting suspect was son of teacher
Obama tears up in emotional  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles