మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులగా చేరుబోతున్నామని అనుకున్నారు మొన్న డీఎస్సీ 2012 రాసి ఎంపికైన అభ్యర్థులు. ఎన్నో రోజుల నుండి కన్న కల సాకారం కాబోతుందని అనుకున్నారు. కానీ వారి ఆశల పై ప్రభుత్వం నీల్లు చల్లి... మరి కొంత కాలం నియామాకాలను నిలిపివేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్ జిల్లా విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపికలో ప్రక్రియలో స్థానిక - స్థానికేతర అంశం పై సందేహాలు తలెత్తడంతో.. పాఠశాల విద్యాశాఖ ఈ ప్రక్రియను తా త్కాలికంగా వాయిదా వేసింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం శనివారం అభ్యర్థుల తుది ఎంపిక జాబితాలు ప్రకటించాల్సి ఉంది కానీ తాత్కాలికంగా వీటిని నిలిపివేశారు. ఇదే కాకుండా అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ కూడా వాయిదా పడుతోంది.
అయితే.. ఉపాధ్యాయ పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ మెరిట్ అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. ఈ 20 శాతం పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతుందంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి.. అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో 20 శాతం భర్తీకి రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదన్నది వాదన. దీనిపై సర్కారు నుంచి వివరణ వచ్చేంత వరకు డీఎస్సీ-2012 ఉపాధ్యాయ నియామకాల వాయిదా అనివార్యంగా మారింది. మరి మళ్ళీ నియామకాలు ఎప్పుడు చేపడతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more