Man jumps to death in ghaziabad

mental hospital in Agra,Man jumps to death,man commits suicide

Unable to tolerate the laws inability to prosecute the corrupt, a man committed suicide by jumping off a 60-foot water tank in Pratap Vihar of Ghaziabad on Wednesday

Man jumps to death in Ghaziabad.png

Posted: 12/13/2012 09:09 AM IST
Man jumps to death in ghaziabad

Man_jumps_to_death_in_Ghaziabad

మన దేశం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. రోజుకు ఎన్నో స్కాములు బయట పడుతున్నాయి. అవినీతిని అంతం చేయడానికి ఎందరో సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. అయినా రాజకీయ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇలాంటి సంఘటనలతో విసిగి వేసారిన ఓ బాధ్యతాయుతమైన భారతీయుడుగా అవినీతి అక్రమార్కుల పాపాలు చూడలేను అంటూ దేశం కోసం తనను తాను బలితీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... 12వ తేదీ... 12వ నెల... 2012 సంవత్సరం... సమయం మధ్యాహ్నం 12 గంటలా 12 నిమిషాలు. 42 సంవత్సరాల కృష్ణపాల్ గడియారంలో టైమ్ చూసుకున్నాడు! నీళ్ల ట్యాంక్ పైనుంచి కిందికి దూకాడు. అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ సంఘటన ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ పట్టణం... ప్రతాప్ విహార్‌లో జరిగింది. బులంద్‌షహర్‌కు చెందిన కృష్ణపాల్ ఘజియాబాద్‌లో స్థిరపడి... నర్సరీ వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలూ లేవు. కానీ... దేశంలో పెరిగిపోతున్న అవినీతిని చూసి నిత్యం ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమన్నది ఆయన వాదన. అవినీతిని అరికట్టలేని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలన్నది కృష్ణపాల్ డిమాండ్. వాటర్ ట్యాంక్ ఎక్కారు. డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12.12 గంటలకల్లా ప్రధాని రాజీనామా చేయకపోతే కిందికి దూకి చనిపోతానని హెచ్చరించారు. టైమ్ 12.12 గంటలకు కృష్ణపాల్ 80 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇతని ఆత్మహత్యతోనైనా రాజకీయ నాయకులకు, అవినీతి ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court akhilesh yadav
Purandeswari fire on balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles