Rahul team for 2014general elections

rahul team, congress party, union government, manmohan singh, sonia gandhi, congress president, rahul for 2014general elections, political parties, political leaders

rahul team for 2014general elections

13.gif

Posted: 12/02/2012 03:13 PM IST
Rahul team for 2014general elections

       rahul

      వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు రాహుల్ గాంధీ తన అనుచరులను రంగంలోకి దింపారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తోన్న వారు కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సిట్టింగ్ ఎంపీల పనితీరు వారి విజయవకాశాలను అడిగి తెలుసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీకి వ్యతిరేకత ఉంటే కొత్త అభ్యర్ధి పేరును సూచించాలని కోరుతున్నారు.  సీమాంధ్రలో పార్టీ పనితీరును అంచనా వేసేందుకు గోవాకు చెందిన విశ్వజిత్ రాణే,జితేందర్ దేశ్ ముఖ్ రాష్ర్టానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నాయకులందరూ హైద్రాబాద్ లో ఉండటంతో వారిని కలిసే ప్రయత్నం చేశారు.

       ఆయన నిన్న అసెంబ్లీలోని సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు బొత్సను కలిసిన వారు... ఆ తరువాత రాయలసీమకు చెందిన నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటూనే... వైఎస్సార్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందని అడిగారు. ఒకవేళ జగన్ తో రాజీ కుదుర్చుకుంటే ఎలా ఉంటుదని  మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. అందుకు జెసి హైకమాండ్ రాజీకి సిద్ధంగా ఉన్నా... జగన్ సుముఖంగా లేరని చెప్పినట్టు సమాచారం. ఇదే ప్రశ్నను రాయలసీమకు చెందిన మంత్రులు టిజి వెంకటేశ్,ఏరాసు ప్రతాప్ రెడ్డి, అహ్ముదుల్లాను కూడా అడిగినట్టు తెలిసింది. మరో నాలుగు రోజులు రాహుల్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై హైకమాండ్ కు నివేదిక ఇస్తారు.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Building construction in record two days time
Free coaching for exise constables exam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles