Dating in britain

Dating in Britain, britain youths, britain girls, first dating, lies,

Dating in Britain

Dating.gif

Posted: 11/24/2012 05:55 PM IST
Dating in britain

Dating in Britain

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పూర్వం నానుడి... ఇప్పుడు పెళ్లికి కాదు... పెళ్లికి ముందు డేటింగ్ నాటి నుంచే అబద్ధాలు మొదలుపెట్టేస్తున్నారు యువకులు. సంపాదన, అభిరుచుల విషయంలో మరింత గొప్పలకు పోతున్నారట! ఇదంతా డేటింగ్ తొలిరోజునే అమ్మాయి దృష్టిలో ‘మంచి’ మార్కులు కొట్టేయడానికేనని అంగీకరిస్తున్నారు కూడా. అంతేకాదు ఇలా తొలిపరిచయంలో అమ్మాయిలూ అన్నీ నిజాలే చెబుతారని తాము ఆశించట్లేదని సగానికి పైగా యువకులు కుండబద్దలు కొడుతున్నారు. బ్రిటన్‌లో 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న 700 మంది యువకులతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓ వెబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.

Dating in Britain

తొలిచూపులోనే అమ్మాయిల మనస్సు గెలుచుకునేందుకు తమ సంపాదన, అభిరుచుల గురించి అబద్ధాలు చెప్పినట్లు 74 శాతం యువకులు అంగీకరించారు. సంపాదన శక్తి గురించి కొంచెం ‘అతి’గా చెప్పినట్లు 63 శాతం మంది ఒప్పుకున్నారు. ఆమెను మరింత ఆకట్టుకొనేందుకు తమ కెరీర్ పురోగతి గురించి సగానికి పైగా యువకులు అతిశయోక్తులు చెప్పినవారే. చివరకు తమ ఆసక్తి, అభిరుచులనూ అబద్ధాల జాబితాలో చేర్చేసినవారూ 55 శాతం మంది ఉన్నారు. తమకు క్రీడలు ముఖ్యంగా ఫుట్‌బాల్ అంటే పడి చస్తామని చెప్పారట. ఇప్పటివరకు జిమ్ ముఖం చూడకపోయినా, కనీసం వ్యాయామం చేయకపోయినా తమకు జిమ్‌లో గడపటమంటే ఎంతో ఇష్టమని సగం మంది గొప్పలకు పోయినవారే.  ఇక తమ ‘సున్నిత మనస్సు’ను ఆవిష్కరించేలా తమకు కళల్లో ప్రవేశం ఉందని, జంతువులంటే ప్రేవని చెప్పుకొన్నారట. ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తూనే వేరొక యువతితో చాటింగ్ కొనసాగిస్తున్నట్లు మూడో వంతు మంది యువకులు అంగీకరించారు. అంతేకాదు దాదాపు సగం మంది గతంలో తమ విడాకుల గురించి కానీ, పిల్లలు ఉన్నారన్న విషయంలో కానీ అబద్ధం చెప్పినట్లు వెల్లడించారు. ఇదేమిటంటే... డేటింగ్‌లో అవతల అమ్మాయి కూడా పూర్తి నిజాయితీగా వ్యవహరిస్తారని తాము భావించట్లేదని, అందుకే తొలిరోజుల్లో అబద్ధం చెప్పడం సరైనదేనని 64 శాతం మంది యువకులు సమర్థించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader m narasimhulu hunger strike in gunpark
150 cars are involved in a massive traffic accident in texas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles