భారీ రాబడులు ఇస్తామని రెండు లక్షల మంది ఇన్వెస్టర్లకు టోపీ వేసి రూ.493 కోట్లు దండుకున్న నయవంచక దంపతులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాగపూర్‌కు చెందిన ఉల్హస్ ప్రభాకర్ ఖైరే(33), ఆయన భార్య రక్షా ఉర్స్(30)ను ఏడాది గాలింపు తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరి పట్టణంలో ఢిల్లీ ఆర్థిక నే రాల విభాగం(ఈవోడబ్ల్యూ) నిఘా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి మోసం వివరాలను ఈవోడబ్ల్యూ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ గోయెల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి పాసైన ఖైరే, బీఏ మధ్యలోనే ఆపేసిన ఉర్స్లు 2010లో లోకేశ్వర్ దేవ్, ప్రియాంకా సారస్వత్ దేవ్ అనే నకిలీ పేర్లతో ఢిల్లీలో స్టాక్ గురు ఇండియా అనే స్టాక్ మార్కెట్ కంపెనీని ఏర్పాటు చేశారు.
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తొలి ఆరు నెలల్లో అసలుపై 20 శాతం రాబడిని, ఏడో నెలలో అసలు పెట్టుబడిని తిరిగి చెల్లిస్తామని మదుపర్లను ఊరించారు. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన రెండు లక్షల మందికిపైగా ఇన్వెస్టర్లు రూ.10 వేలు, అంతకు మించిన మొత్తాలను పెట్టుబడిగా పెట్టారు. ఖైరే దంపతులు ఇన్వెస్టర్ల నుంచిరూ.493 కోట్లను సేకరించి తమ కార్యాలయాన్ని ఆకస్మికంగా మూసేశారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొరాదాబాద్, డెహ్రాడూన్, గోవా తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరి మోసంపై గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు పోలీసులకు బాధితుల నుంచి 14వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. డెహ్రాడూన్‌లో విద్యాసంస్థను స్థాపించి ఫీజలు దండుకుని బోర్డు తిప్పేశారు. ఆ డబ్బుతో ఢిల్లీలో స్టాక్ గురు ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more