Anam viveka happy to chiru union cabinet

anam vivekananda reddy happy to Chiru fans, nellore mla to chiru support , chiru fans celebrated to anam dance, chiru fans in nellore town, chiranjeevi fans celebrated , chiranjeevi fans celebration at nellore,

anam viveka happy to chiru union cabinet

anam.gif

Posted: 11/03/2012 05:45 PM IST
Anam viveka happy to chiru union cabinet

Chiru Support  anam viveka happy to union cabinet

ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నాయకులు తమకు తామే సాటి అనిపించుకుంటారు. ఎత్తులు, పైఎత్తులు వేయడంలో నెల్లూరు నేతలకు వెన్నతో పెట్టిన విద్య. చిరుకి మంత్రి పదవి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆనం వివేకానందరెడ్డి తన చతురత చాటుకున్నారు. రాజకీయంగా స్టైల్  ఆఫ్ సింహపురి పేరుతో ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి ఆనం. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. నెల్లూరు ఏ.సి. సెంటర్ లో చిరు అభిమానులు ఏర్పాటు చేసిన సభా వేదికకు సిగరేట్ తాగుతూ స్టైలిష్ గా వచ్చారు. అయితే అక్కడ ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. సభ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన గ్యాస్ బెలూన్లను పైకి వదిలే సమయంలో ఒత్తిడికి గురైన బెలూన్లు....ఒక్కసారిగా పేలిపోయి...వేదికపై మంటలు అలుముకున్నాయి. ఊహించని విధంగా ఎదురైన ఈ ప్రమాదంతో చిరు అభిమానులు వేదికపై నుంచి చెల్లా చెదురయ్యారు. అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ నేత మాత్రం ఎటు వెళ్లలేని పరిస్థితిలో ప్రమాదం నుంచి తప్పించుకుని నిలబడ్డారు. ఆపై కాస్త ఊపిరి పీల్చుకున్న వివేకానందరెడ్డి అక్కడి నుంచే ప్రసంగం మొదలుపెట్టారు. ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిదంటూ ఊహించని పరిణామాన్ని, ప్రమాదాన్ని సైతం అనుకూలంగా మార్చుకొని ప్రసంగించారు. కొత్తగా కేంద్ర మంత్రి పదవి పొందిన చిరును ఆకాశానికెత్తేశారు. ఆయన అభిమానులను ఉత్తేజపరుస్తూ..చిరు నెల్లూరి మేనల్లుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర నాయకత్వానికి చిరంజీవి తగిన వ్యక్తిగా కితాబిచ్చారు ఎవరెన్ని చెప్పినా, ఒప్పుకున్నా...లేకపోయినా... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చిరు నాయకత్వం చిక్కాని అన్నారు. ఆయనకు నెల్లూరీయులందరు మేనమామలంటూ చలోక్తులు విసిరారు. మరుక్షణమే ప్రతిపక్షాలపై విరుచకపడ్డారు. ఇంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మత్తు మాత్రలు వేసుకొని నిద్రపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు సభ స్వతంత్ర వేదికైనందున తానేమైనా మాట్లాడుతానంటూ అభిమానులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. ఓవైపు సంచలనాలు, మరోవైపు పొగడ్తలతో ముంచెత్తుతూ ఆనం ప్రసంగాన్ని సాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malalas father embassy job in uk
Vishnu complaint on brahmins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles