Deputy cm wife padmini reddy

deputy cm wife padmini reddy, she is well ngo, dy cm damodar rajanarsimha wife, padmini reddy, foundation

deputy cm wife padmini reddy

30.gif

Posted: 10/25/2012 09:01 PM IST
Deputy cm wife padmini reddy

dy_cm

"నా భార్య నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా'' అని డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ అన్నారు. ఆయన భార్య పద్మిని రెడ్డి స్థాపించిన 'షీ ఈజ్ ఆల్' స్వచ్ఛంద సంస్థ (సియా ఎన్జీవో)ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజనరసింహతోపాటు, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డి.కె.అరుణ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సియా ఎన్జీవో స్థాపనకు కారణమైన అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనను డిప్యూటీ సీఎం ప్రారంభించగా.. లోగోను సునీతా లక్ష్మారెడ్డి, సంస్థ లక్ష్యాలను డీకే అరుణ ఆవిష్కరించారు. "నా భార్య నాకు సన్మానంలో వచ్చిన శాలువాలన్నీ జమ చేసి, ఒక రోజు రాత్రి నగరంలో రోడ్డుపై నిద్రించే వారికి పంచుతుంది. ఆమెకు పక్షులంటే ఎంతో ప్రేమ. ఇలా ఒక ఎన్జీవో ప్రారంభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఎన్జీవో అన్ని విధాలా సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా'' అని రాజనరసింహ అన్నారు. కాగా.. పక్షులకు స్వేఛ్చ, మహిళలకు మనోబలం, పిల్లలకు చదువు.. ఇవే సియా ఎన్జీవో లక్ష్యాలని పద్మిని రెడ్డి తెలిపారు. ఈ మూడు లక్ష్యాలూ నేరవేరిన రోజున తమ సంస్థ స్థాపనకు ఒక అర్థం ఉంటుందన్నారు. మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందేలా చూస్తామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanwarlal
Sharmila tagore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles