ఇప్పుడెలాగూ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి.. మనిషి బెస్ట్ ఫ్రెండ్ కుక్క విషయానికొచ్చేసరికో.. ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చేస్తామా ఏమిటి? వాటికీ అటు ఏడు తరాలు.. ఇటు ఏడుతరాలు.. అందచందాలు అన్నీ చూడాల్సిందే! అవును.. ఇప్పుడు కుక్కలకీ పెళ్లి సంబంధాల వెబ్ సైట్ ఉంది.అదీ మన దేశంలోనే.. దాని పేరు క్యాండీరోమియో.కామ్. దేశంలోనే తొలి కుక్కల పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది చిత్రంలోని మహిళ ఢిల్లీకి చెందిన కరీనా అబోట్. ఈ సైట్‌ను మీరు ఓపెన్ చేయగానే.. ఇందులో పెళ్లీడుకొచ్చిన శునకాల చిత్రాలు, వాటి వయసు, గుణగణాలు ఇతర వివరాలన్నీ ఉంటాయి. కరీనా లండన్‌లో చదువుకుంటున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందట. యజమానులు తమ కుక్కలకు సరైన జోడీని వెతికేందుకు సహాయపడాలని నిశ్చయించుకుని ఈ సైట్‌ను రూపొందించారట.
ముఖ్యంగా కుక్కల ‘డేటింగ్’కు ఈ సైట్ ఉపయోగపడుతుంది. మరీ బాగా నచ్చేసుకుని పెళ్లికి రెడీ అయిపోతే.. వీరే దగ్గరుండి ఆ ముచ్చటా జరిపించేస్తారు. అదీ మామూలుగా కాదు.. ఇందుకోసం అరబిక్ నైట్స్, న్యూయార్కర్ నైట్స్, కరేబియన్ నైట్స్ అంటూ థీమ్స్ కూడా ఉన్నాయి.దీని కోసం వారు కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు. అరబిక్ నైట్స్‌లో శునకాలకు హుక్కా ఏర్పాటు చేస్తారట! క్యాండీ థీమ్‌లో వాటి కోసం పెడిక్యూర్, మానిక్యూర్ వంటివి ఉంటాయి. ఇందులో డ్రస్ కోడ్ కూడా ఉంటుంది. ఈ థీమ్‌లో గుస్సీ కంపెనీ దుస్తులనే వాడాలి. ఢిల్లీలో ఉన్నవారికైతే.. కుక్కల ‘డేటింగ్’ను కరీనా తన ఫార్మ్‌హౌస్‌లో జరిపించేస్తోంది. వేరే ప్రదేశాల వారైతే.. వధూవరుల తాలూకు వాళ్లు సెట్ చేసుకున్నా సరే.. లేదంటే ఢిల్లీకి తీసుకువస్తే.. కరీనానే సంప్రదాయం ప్రకారం అంతా జరిపించేస్తోందట! గతేడాది ఈ సైట్ మొదలు కాగా.. అదే సంవత్సరంలో 1,065 కుక్కల డేటింగ్‌లు లేదా కల్యాణాలు కరీనా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే 665 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చివరికి అమెరికావాసులు సైతం ఈ సైట్ సేవలను ఉపయోగించుకుంటున్నారట! కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ ఈ సైట్ ద్వారానే తన కుక్కకు తగు జోడీని వెతికారు. గతేడాది చివర్లో రోమన్ స్టైల్లో మూడ్రోజుల పెళ్లి జరిపించారు. ఇప్పుడా కుక్కల జంట పిల్లాపాపలతో ఎంతో సుఖంగా ఉందని కరీనా మురిసిపోతూ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more