ఆధునిక భారతంలో ఓ అభినవ హరిశ్చంద్రుడి ఉందతమిది. కాసుల కోసం కక్కుర్తిపడి కట్టుకున్న దాన్నే అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఓ దుర్మార్గపు భర్త సొమ్ముల కోసం సహచరిని బేరం పెట్టాడు. కట్టుకున్నదన్న కనికరం కూడా లేకుండా వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. పన్నాగం బెడిసికొట్టడంతో కాలికి బుద్ధిచెప్పాడు. పత్తా లేకుండా పరారయ్యాడు. కరీంగనర్ జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన రాజేందర్, అమ్మాయి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కొడుకులు. తాగుడుకు బానిసయిన రాజేందర్ పూటుగా తాగొచ్చి అమ్మాయిని నిత్యం వేధించాడు. విచక్షణారహితంగా చిత్రహింసలు పెట్టేవాడు. పుస్తె కట్టినోడు కసాయోడయినా కాచుకోవాలన్న భారత సంప్రదాయాన్ని నమ్మిన మహిళ కాబట్టి రాజేందర్ పెట్టే బాధలను అమ్మాయి ఓర్చుకుంది. రోజురోజుకు రాజేందర్ రెచ్చిపోతున్నా సహించింది. కానీ దుర్మార్గుడు ఏకంగా ఆమెను అంగడి సరుకు చేయాలనుకున్నాడు.ఊరికి వెళుతున్నామని చెప్పి అమ్మాయిని బస్టాండ్‌కు తీసుకెళ్లాడు రాజేందర్. కోరుట్ల బస్టాండ్‌లో ఓ వ్యక్తి వచ్చి తీసుకెళతాడని చెప్పి బస్సెక్కించాడు. భర్త మాటలను అమాయకంగా నమ్మిన అమ్మాయి చివరికి కుట్ర గురించి తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. డబ్బు కోసమే తనను అమ్మేశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు, తన బిడ్డలకు రక్షణ కల్పించాలని వేడుకుంది. భర్త ఏంచేస్తాడోనన్న భయంతో ఆమె వణికిపోతోంది. కట్టుకున్న భార్యను అమ్మకానికి పెట్టిన కఠినాత్ముడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని మానవతావాదులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more