Peoples ias officer sr sankaran

People's IAS officer S.R. Sankaran

People's IAS officer S.R. Sankaran

Sankaran.gif

Posted: 10/15/2012 12:29 PM IST
Peoples ias officer sr sankaran

People's IAS officer S.R. Sankaran

పేదల ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ విగ్రహాన్ని సచివాలయం లోని సాంఘిక సంక్షేమ భవన్‌లో ప్రతిష్ఠించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తి వేదిక (జనశ్రీ) ఆధ్వర్యంలో సభ జరిగింది.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కాకీ మాధవరావు, కేఆర్ వేణుగోపాల్ తదితరులు ఆవిష్కరించారు. దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం శంకరన్ కృషి చేశారని ఆర్డీఎఫ్ జాతీయ అధ్యక్షుడు వరవరరావు నివాళి అర్పించారు.పద్మభూషన్ ఇస్తామన్నా తీసుకోలేదని శ్లాఘించారు. శంకరన్‌ను గుర్తుపెట్టుకోవడం సామాజిక మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని అర్థం చేసుకోవడం వంటిదని ప్రముఖ పాత్రికేయుడు మల్లెపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. శంకరన్ జ్ఞాపకార్థం మీడియా అవార్డులను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. వెబ్‌సైట్‌లో ఆయన ఆలోచనలను, వ్యాసాలను, కొన్ని చారిత్రక ఘటనపై ఆయన స్పందనలను పొందుపరిచినట్టు కేఆర్ వేణుగోపాల్ వివరించారు. శంకరన్ లేకుండా విప్లవ పార్టీలు ప్రభుత్వంతో చర్చలకు వచ్చేవారు కాదని ప్రొ. హరగోపాల్ గుర్తుచేశారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు రాజు, సిద్దోజీ, శశిభూషణ్, సందీప్, రాంచందర్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles