Bio diversity conference hyderabad

bio diversity conference hyderabad, new session starts from monday onwards

bio diversity conference hyderabad

9.png

Posted: 10/08/2012 01:49 PM IST
Bio diversity conference hyderabad

What-is-Bio-Diversity

ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరంలో జరుగుతోన్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ఇవాల్టి నుంచి (సోమవారం) నుంచి రెండో అంకం ప్రారంభమైంది. అత్యంత కీలకమైన జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహం, సభ్యదేశాల పాత్రపై విస్తృత చర్చకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగే ఈ ప్రతిష్టాత్మక చర్చల్లో పాల్గొనేందుకు 193 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో తొలి అంకమైన జీవ భద్రత సమావేశం (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్... కాప్-6) శుక్రవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అత్యంత ప్రాధాన్యమైన రెండో ఘట్టం జీవవైవిధ్య సదస్సు (కాప్-11) సోమవారం ఉదయం ఆరంభమైంది. కాప్-11ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రకృతి పరిరక్షణ లక్ష్యంగా వివిధ అంశాలపై ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకూ వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతాయి. 2010లో జపాన్ దేశంలోని నగోయాలో జరిగిన కాప్-10లో చేసిన ఒప్పందం పురోగతి, అమల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తారు. కేంద్రమంత్రి జయంతి నటరాజన్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. అంతర్జాతీయ మీడియా రాకతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kapunadu dharna jantar mantar
Gas cylender price hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles