Briefcase robot

Briefcase Robot

Briefcase Robot.

Briefcase Robot.png

Posted: 10/05/2012 05:33 PM IST
Briefcase robot

Briefcase-Robotప్రయాణాల్లో సూట్ కేసులు మోయడం పెద్ద పని. అయితే, ఈ హాప్ అనే రోబోటిక్ సూట్‌కేసుతో మనకలాంటి కష్టాలుండవు. దీన్ని మనం మోయాల్సిన పనిలేదు. మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఆదేశాలిస్తే.. కుక్కలా మనవెంట నడుస్తుంది. దీన్ని స్పెయిన్‌కు చెందిన యువ డిజైనర్ రోడ్రిగో గార్సియా గోంజలెజ్ తయారుచేశాడు. ఈ ప్రొటోటైప్ మోడల్‌ను యూట్యూబ్ వీడియో ద్వారా ఆవిష్కరించారు. సూట్‌కేసులో ఉండే మైక్రో ప్రొసెసర్, సెన్సర్లు బ్లూటూత్ ద్వారా ఫోన్‌తో అనుసంధానించి ఉంటాయి. ఫోన్‌లో ఇచ్చే ఆదేశాల ద్వారా ఇది మన వెనుక వచ్చేస్తుంది.

ఒకవేళ సిగ్నల్ కట్ అయితేనో.. అన్న భయం కూడా లేదు. ఎందుకంటే.. సిగ్నల్ కట్ అయితే.. ఈ సూట్‌కేస్ వెంటనే లాక్ అయిపోతుంది. సిగ్నల్ కట్ అయిన విషయాన్ని యజమాని ఫోన్‌ను వైబ్రేట్ చేయడం ద్వారా తెలియజేస్తుంది. దీన్నింకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందని.. ఆ తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని రోడ్రిగో చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook now has more than 100 crore users
Revolver of ram jethmalani stolen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles