Ganapati homam for ys jagan release at guntur

Ganapati Homam for YS Jagan release at Guntur

Ganapati Homam for YS Jagan release at Guntur

Homam.gif

Posted: 09/27/2012 04:42 PM IST
Ganapati homam for ys jagan release at guntur

Ganapati Homam for YS Jagan release at Guntur

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలను, ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ గుంటూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యాగం నిర్వహించింది. ఇరవై మంది వేద పండితులతో చతురావృత గణపతి హోమాన్ని చేపట్టారు. నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. జగన్ బయటకు రావాలని రాష్ట్ర ప్రలు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. 26 జివోలు విడుదల చేసిన మంత్రులు తాము తప్పు చేయలేదని చెబుతున్నారని, అలాంటప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎలా దోషి అవుతారని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రశ్నించారు. అక్రమ కేసుల నుంచి వైయస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మరో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకుంటున్న పాలనను జగన్ అందిస్తారన్నారు.

కాగా అంతకుముందు రోజు తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా అధికారంలోకి రాబోరని అంబటి రాంబాబు అన్న విషయం తెలిసిందే. చంద్రబాబు పాదయాత్ర పులిని చూసిన నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన పాదయాత్రకు చంద్రబాబు నిజంగా వస్తున్నా నమ్మండి అనే పేరు పెట్టుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రజా సమస్యలు తెలియవా అని ఆయన అడిగారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2014లో కూడా ముఖ్యమంత్రి కాబోననే భయంతోనే చంద్రబాబు చివరి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారం కోసం చంద్రబాబుది ఆఖరి పోరాటమని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు అధికారంలో కోసం పాదయాత్ర చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు మైనారిటీ నేత రెహ్మాన్ విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టిందని, జగన్ బయటకు వస్తే ప్రభుత్వం కూలిపోతుందేమోనని భయపడుతున్నారని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sridhar babu comments on kodandaram
Gold robbery in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles