Trs leaders meeting at kcr

TRS Chief KChandrasekhar Rao, TRS Leaders,

trs leaders meeting at kcr

trs.gif

Posted: 09/27/2012 04:27 PM IST
Trs leaders meeting at kcr

trs leaders  meeting at kcr

టీఆర్ఎస్ నేతల భిన్న వైఖరిని అవలంభిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆరేమో కేంద్రంలో నెలకుని ఉన్న రాజకీయ అనిశ్చిత కారణంగా కొంత సంయమనంతో వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు గులాబీ దండు చెప్పుతోంది. కానీ, ఇదే పార్టీకి చెందిన సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ మాత్రం ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన తెలంగాణ మార్చ్ లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారనీ, తూటాలకు భయపడమనీ, పోలీసులు, ఇనుప కంచెలె తెలంగాణ మార్చ్ ను ఆపలేవంటున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణపై ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీలో 21రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం తెలంగాణపై కొంత నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మరికొంత సంయమనంతో వ్యవహరించాలనీ నిర్ణయించుకున్న కేసీఆర్ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే మకాం వేసి.. తెలంగాణ సాధన విషయంలో సంప్రతింపులు కొనసాగించాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణపై ఏదో ఒకటి తేలేదాకా ఢిల్లీలోనే ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, తెలంగాణపై వాయలార్ రవి మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ను కొంత నిరాశపర్చినప్పటికీ తాడోపేడో తేల్చుకోవాలనీ కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్మడం లేదనిపిస్తోంది. చర్చలు.. చర్చలే, పోరాటాలు..పోరాటాలే. కేంద్రం స్పందించి తెలంగాణ ఇస్తే సంబురాలు చేసుకుంటం, ఇవ్వకుంటే పోరాటం చేస్తాం అని హరీశ్ హెచ్చరిస్తున్నారు.  సీఎం మాటలపై తెలంగాణ మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మంత్రులు హైకమాండ్‌పై తిరగబడాలని పిలుపునిస్తున్నారు. లక్షలాది కుటుంబాలు మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పల్లెల నుంచి చీమలదండులా తరలిరావాలని కోరారు. ఇలా టీఆర్ఎస్ లో ఒకరు దూసుకెళ్తుంటే…మరొకరు మరింత సంయమనంతో ఉండాలనీ నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడం తెలంగాణవాదుల్లో కొంత అయోమయానికి దారి తీస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదులు సమరం చేయడం తథ్యంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold robbery in hyderabad
Babu writes letter asking for all party meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles