Babu writes letter asking for all party meet

Pranab Mukherjee,Manmohan Singh

TDP chief N Chandrababu Naidu on Wednesday night shot off a letter to PM Manmohan Singh requesting the Centre to convene an all-party meeting where his party's stand would be clearly spelt out

Babu writes letter asking for all-party meet.png

Posted: 09/27/2012 11:33 AM IST
Babu writes letter asking for all party meet

Chandrababu

ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎంతోకాలం నుంచి ప్రత్యేక తెలంగాణపై కేంద్రం ఎటూ తేల్చకుండా నానబెడుతోందని, ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణపై పార్లమెంటులో తీర్మానం చేయాలని, తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అక్కడికక్కడే తేల్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తమ పార్టీ వైఖరిని 2008లోనే కేంద్రానికి తెలియచేశామని, అయినా కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో బాధ్యతారాహిత్యంగా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ నాన్చుడు ధోరణి వల్ల ఇప్పటికే విపరీతమైన నష్టం జరిగిందని, రాష్ట్రంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

ఈ లేఖ పై టీఆర్ఎస్ అధ్యక్షుడు, సిద్ధపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండి పడ్డారు. 'బాబు రాసిన లేఖ మరో మోసం. మరో దగా. తీర్మానం అన్నారు. నిన్నటి దాకా శాసనసభలో టీఆర్ఎస్ తీర్మానం కోసం పట్టుబడితే టీడీపీ ఎందుకు కలిసి రాలే దు?' అని కేసీఆర్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leaders meeting at kcr
Telangana march and ganesh nimajjanam effect  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles