Andhra pradesh assembly session

andhra-pradesh-assembly-session, opposition parties distrub

andhra-pradesh-assembly-session

andhra-pradesh-assembly-session.png

Posted: 09/21/2012 03:43 PM IST
Andhra pradesh assembly session

        అసెంబ్లీలో నాల్గవ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది.  విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టడంతో నాల్గవ రోజుకు సభకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అటు బీఎసీలో పార్టీలు లేవనెత్తిన అంశాలను అసెంబ్లీలో చర్చించాలని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికే మూడు రోజులు వృథా అయిందని, ఈ రెండు రోజులైన ap_assemblyప్రజాసమస్యలు చర్చించాలని స్పీకర్ కు ఆనం విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. విద్యుత్ సమస్య సహా ఇతర ప్రజా సమస్యలను చర్చకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభ వాయిదా పడుతుండటం వల్ల ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు.
    శాసనసభ్యులకు స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై పట్టుబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడుతారని స్పీకర్ సభ్యులకు చెప్పిన పట్టించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంటపాటు వాయిదా వేశారు. బీఎసీలో పార్టీలు లేవనెత్తిన అంశాలను అసెంబ్లీలో చర్చించాలని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికే మూడు రోజులు వృథా అయిందని, ఈ రెండు రోజులైన ప్రజాసమస్యలు చర్చించాలని స్పీకర్ కు ఆనం విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్షాలు వినకపోవటంతో నాల్గవరోజూ పాత తంతే కొనసాగింది. విలువైన సభాసమయం వ్రుధా అయింది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gas subsidi cylendors rise
Indian origion sunita williams  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles