World record of 90 years of police service

World record of 90 Years of Police Service,World record ,Uttar Pradesh,the record ,The National,|Sardar Vallabhbhai Patel National Police Academy ,Manusmriti ,London ,IPS Officer World Record ,ips officer ,Indian Police Service ,David Stewart ,4th Generation IPS Officer

World record of 90 Years of Police Service

record.gif

Posted: 09/04/2012 03:09 PM IST
World record of 90 years of police service

World record of 90 Years of Police Service

 మనుస్ర్ముతి.. పేరు వినగానే ఆ పేరు వెనుక చాలా చరిత్ర ఉందని  అనిపిస్తుంది. కానీ ఇక్కడ  మాట్లాడుతున్నది మనుస్ర్ముతి అనే ఒక యువతి గురించి. ఆమె  కుటుంబం గురించి. భారతదేశంలోని  బీహార్ రాష్ట్రంలో  ఔరంగాబాద్ గ్రామానికి చెందిన ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత  ఉంది. 1921లో మనుస్ర్ముతి  ముత్తాత హరిహర్ ప్రసాద్  బీహార్ పోలీసు  విభాగంలో  కానిస్టేబుల్ గా చేరారు. అటు బ్రిటిష్  పాలనలోనూ, ఇటు భారత పాలకుల  హాయంలోనూ పని చేసి 1954 లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పదవీ విరమణ  చేశారు.  ఆయన ఉద్యోగంలో  ఉండగానే 1952లో  ఆయన కుమారుడు  అరవింద్ ప్రసాద్  పోలీసు సర్వీసులో జాయిన్  అయ్యారు.  సబ్ – ఇన్ స్పెక్టర్ గా  సర్వీసులో  చేరిన  ఆయన సుదీర్ఘ కాలం పని చేసి 1988 లో ఏఎస్పీ హోదాలో  రిటైరయ్యారు. 

అరవింద్ ప్రసాద్  పదవిలో  ఉండగానే  ఆయన కుమారుడు కమలేంద్ర ప్రసాద్ పోలీసు  సర్వీసులో  చేరారు. 1981లో ఉత్తర ప్రదేశ్  కేడర్ లో ఐపీఎస్ అధికారిగా  ఆయన  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం  పలు హోదాల్లో పని చేసి, ప్రస్తుతం  ఢిల్లీలోని నేషనల్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  క్రిమినాలజీ  అండ్ ఫోరెన్సిక్  సైన్సెస్ కు  డైరెక్టరుగా కొనసాగుతున్నారు.  పూర్వం  నుంచి పోలీసు  కుటుంబం కావడంతో  వారి పిల్లలకు  కూడా ఆ  జాబ్ పై మమకారం ఏర్పడింది.  ఆ దిశగా వారి అడుగుల పడ్డాయి. అలా నాలుగోతరానికి  చెందిన కమలేంద్ర  ప్రసాద్  కూతురు  మనుస్ర్ముతి కూడా ఐపీఎస్ కు  ఎంపికయ్యారు. 2011 లోశిక్షణ  పూర్తి  చేసుకుని  ఇటీవల  ఆమె బాధ్యతలు  చేపట్టారు.  ఇలా 90 సంవత్సరాలుగా ఆ కుటుంబం  పోలీసు వ్యవస్థలో  పని చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.  ఈ విధంగా  ఒకే కుటుంబం  ప్రపంచంలో ఎక్కడా  ఇన్నేళ్లు పోలీసు  వ్యవస్థలో  పనిచేయలేదు.  అయితే , ఐపీఎస్ గా చేరిన  కొంతకాలానికి  గాని మనుస్ర్ముతి కి ఈ విషయం తెలియకపోవడం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  We will fulfill baba s ideals ratnakar
Facebook slaves  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles