Facebook slaves

facebook slaves, Internet, doctor, cristian mentag , Bone , University, Slaves, 132 members, Womans, Mans, Facebook, Twitter, for Day,

facebook slaves

facebook.gif

Posted: 09/04/2012 01:20 PM IST
Facebook slaves

facebook slaves

మహిళలు సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌పట్ల అత్యంత మక్కువ చూపుతున్నారు. ఈ విషయంలో మహిళలు పురుషులను మించి పోయారని తాజా సర్వే తేల్చి చెప్పింది. అయితే తప్పు తమది కాదని తమ జన్యువులదని అంటున్నారు. ఈ విషయాన్ని పరిశోధకులు కూడా ఒప్పుకుంటు న్నారు. ఇంటర్నెట్‌పై కొద్దిమంది ఎక్కువగా గడపటం, మరికొంతమంది దానిపై అవసరమున్నంతవరకే ఆధారపడటం వెనుక ఉన్న కారణాల అన్వేషణకు డాక్టర్‌ క్రిస్టియన్‌ మోంటాగ్‌ ఆధ్వర్యంలో బోన్‌ యూని వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇంటర్నెట్‌కు బానిసకావట మనే అలవాటుకు కారణం ఊహా జనిత ప్రపం చాన్ని నిజమని భావించే మనస్తతత్వం కాదన్న విషయం తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న 843 మంది ఇంటర్నెట్‌ అలవాట్లను తెలసుకున్నారు. వీరిలో 132 మంది ఆన్‌లైన్‌ బానిసలుగా గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఈ ఆన్‌లైన్‌ పట్ల విపరీతంగా మక్కువ చూపుతున్న వీరంతా మహిళలే కావటం గమనార్హం. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర వెబ్‌సైట్లే వీరిలో ఈ విపరీత అలవాటుకు కారణమని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మోంటాగ్‌ అన్నారు. రోజులో పగటి పూట కూడా ఈ మహిళల ఆలోచనలు ఇంటర్నెట్‌ చుట్టూ పరిభ్రమిస్తుంటాయని, అంతేకాక, రోజు లో ఒకసారైనా ఇంటర్నెట్‌ను ఉపయోగించకపోతే వారి రోజువారీ దినచర్య కూడా దిగులుగా గడుస్తుందని అధ్యయనంలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World record of 90 years of police service
Mothers sourcing breast milk on social media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles