Central government employees news

Central Government Employees News

Central Government Employees News

Central.gif

Posted: 09/04/2012 10:56 AM IST
Central government employees news

Central Government Employees News

బాగా పని చేసేవారికి ప్రోత్సాహం! పనిచేయని వారికి తిరస్కారం! ఇది కేంద్ర ప్రభుత్వ తాజా ఆలోచన! ఆరో వేతన కమిషన్ సిఫారసు చేసిన... పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (ప్రిస్) కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనిని అమలు చేసే దిశగా కదులుతోంది. అటు... పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా పథకాన్ని రూపొందించింది. అయితే... పని తీరును బట్టి ప్రోత్సహించడంతోపాటు పనిచేయని వారికి 'శిక్షవిధించాలని కూడా కేంద్రం భావిస్తోంది.దీనిని అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్‌లకు వర్తింప చేయాలని యోచిస్తోంది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఈ అధికారుల పని తీరును సమీక్షించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కేంద్ర సిబ్బందిశిక్షణశాఖ ఈ పని చేస్తోంది. విధి నిర్వహణ తీరు ఏమాత్రం సంతృప్తికరంగాలేని అధికారులకు 'నిర్బంధ పదవీ విరమణఅమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

"అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరును సమీక్షించే ప్రక్రియ కేంద్ర స్థాయిలో ఇప్పటికే మొదలైంది. ఈ కసరత్తు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచించాం. ఆరు నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి చెక్ చెప్పడమే మా ఉద్దేశం'' అని కేంద్ర సిబ్బందిశిక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అఖిలభారత సర్వీసు అధికారుల సేవలను మాత్రమే సమీక్షించే వారు.పనితీరు బాగలేదని తేలితే... నిర్బంధ పదవీ విరమణ అమలు చేసే వారు. ఈ ఏడాది జనవరిలో దీనికి సంబంధించిన నిబంధనలను సవరించి గడువును 15 సంవత్సరాలకు తగ్గించారు. ఐఏఎస్ఐపీఎస్ తదితర అధికారులు 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వెంటనే తొలి పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరి పని తీరు బాగా లేకపోతే ప్రజా ప్రయోజనాల రీత్యా ఆ అధికారిని నిర్బంధంగా ఇంటికి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తొలి పరీక్ష నెగ్గితే... తిరిగి 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాక లేదా 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మరో విడత ఆ అధికారి పనితీరును సమీక్షిస్తారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teachers dont use cell phones in the classroom
Delhi jilted lover goes on a spree killed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles