Shok for nandamuri balakrishna

shok for nandamuri balakrishna

shok for nandamuri balakrishna

4.gif

Posted: 09/02/2012 03:52 PM IST
Shok for nandamuri balakrishna

      తెలుగుదేశం పార్టీకి నేతలు షాక్ ల మీద షాకులిస్తున్నారు. కొడాలి నాని ఇచ్చిన షాక్  నుంచి కోలుకోక ముందే మరో నేత పార్టీకి గుడ్ chengalaబై చెప్పారు. వాస్తవానికి చెంగల వెంకట్రావుకు బాలకృష్ణ సీటు ఇప్పిస్తే నానికి జూనియర్ సీటు ఇప్పించారు. గుడివాడ సీటు తనకు సన్నిహితుడైన కొడాలికి ఇవ్వాలని చంద్రబాబుపై జూనియర్ ఒత్తిడి తెచ్చి మరి ఇప్పించుకున్నారు. పాయకరావు పేటలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాకర నూకరాజును కాదని సమరసింహరెడ్డి సినిమాకు నిర్మాతగా వ్యవహారించి తనకు హిట్  ఇచ్చిన చెంగల వెంకట్రావుకు 1999లో బాలకృష్ణ సీటు ఇప్పించారు. బాలకృష్ణ, జూనియర్ ఆశీస్సులతోనే సీట్లు సంపాదించిన వారిద్దరూ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. తండ్రి, తాత కాలం నుంచి సేవ చేస్తున్న వారిని కాదని పదవులు కట్టబెడితే జూనియర్ కు కొడాలి నాని పార్టీ వీడి షాకిస్తే తాజాగా చెంగల రూపంలో బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. పదవులు అనుభవించినప్పుడు చంద్రబాబు గురించి పార్టీ గురించి మాట్లాడని వారు పార్టీ వీడే సమయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కనీసం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నా ఇటు బాలయ్య chengala_balaకానీ అటు జూనియర్ కానీ కనీసం నోరు మెదపడం లేదు. పార్టీలో కష్టపడిన వారిని కాదని తమకున్న సాన్నిహిత్యంతో సీట్లు ఇప్పించుకున్న బాలయ్య, జూనియర్ కొడాలి, చెంగల పార్టీని వీడిపోతారనే ప్రచారం జరిగినప్పుడు కూడ వారిని అపే ప్రయత్నం చేయలేదని కార్యకర్తలు అంటున్నారు. కష్టపడిన వారిని కాదని డబ్బు, రాజకీయ ప్రయోజనం కోసం వచ్చిన వారికి సీట్లు ఇస్తే పార్టీ మరింత కష్టాల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్ నేతలు మాత్రం రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజమేనని కొట్టి పారేస్తున్నారు.

...avnl

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran indiramma paryatana tomarrow
Ysr death anniversary today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles