Cm kiran indiramma paryatana tomarrow

cm kiran indiramma paryatana tomarrow

cm kiran indiramma paryatana tomarrow

30.gif

Posted: 09/02/2012 03:58 PM IST
Cm kiran indiramma paryatana tomarrow

        ఇందిర్మ పర్యటనలో భాగంగా సీఎం కిరణ్ రేపటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా శ్రీశైలం డ్యాం సందర్శన, విద్యుత్ ఉత్పత్తిపై ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చెంచుగూడెంలో చౌకధరల దుకాణం, అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించి, స్వయం సహాయక మహిళా బృందాలతో సమావేశమౌతారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణాపురంలో ఇందిర జల ప్రభను ప్రారంభిస్తారు. తర్వాత ఆత్మకూరులో రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ చేపట్టిన  500 ఇళ్ల నిర్మాణాకి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6: 30 గంటలకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సందర్శించి గొర్రెల కాపరుల, పాల ఉత్పత్తిదారులతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు మహానందిలోని ఆర్యవైశ్య సత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి మహానంది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బస చేస్తారు.  cm_kiran_3
        4వ తేదీ ఉదయం మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. తర్వాత గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో...వ్యవసాయ యంత్రికరణ పనులను పరిశీలిస్తారు. 11 గంటలకు నంద్యాలలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శిస్తారు. అక్కడే కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ చిల్డ్రన్  స్పెషల్ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభిస్తారు. 11:30 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్ లో సామూహిక ముస్లిం వివాహా కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పాణ్యం గ్రామంలో ఉద్వానవన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓర్వకల్ గ్రామంలో స్వయం సహాయక మహిళా బృందాలతో సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటలకు ఎపీఎస్ పీ 2వ బెటాలియన్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. రాత్రి కర్నూలు జిల్లా కేంద్రంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో సీఎం బస చేస్తారు.
      5వ తేదీ ఉదయం 9:30 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదాములను ప్రారంభిస్తారు. 10 గంటలకు ఎపీఎస్పీ 2వ బెటాలియన్ స్టేడియంలో గురుపూజోత్సవంలో పాల్గొంటారు. 11 గంటలకు కలెక్టరేట్ దగ్గర పుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించి...తర్వాత జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎపీఎస్సీ బెటాలియన్ స్టేడియంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4: 30 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nri movie audio launch
Shok for nandamuri balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles