రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు బోధనా రుసుము చెల్లింపునకు సంబంధించి మార్గదర్శకాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్ధులందరికీ గరిష్టంగా ఫీజు 35 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదివిన బీసీ, ఈబీసీ వికలాంగ విద్యార్ధులకు ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించనుంది. అలానే ఎస్సీ ఎస్టీ విద్యార్ధులు ఏ కళాశాలలో చదివినా పూర్తి ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇంటర్ ప్రైవేటు కాలేజీల్లో చదివి ఎంసెట్ 10 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు పూర్తి మొత్తం చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉన్నత విద్యాశాఖ రాష్ట్రంలో కాలేజీలను ఫీజుల వారీగా 1-ఎ,1-బీ,1-సీ,1-డీ కేటగిరీలుగా విభజించింది. ఆయా కేటగిరీల్లో కాలేజీల ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి వేర్వేరుగా ఉన్నాయి. కాలేజీ కేటగిరి, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజులు మంజూరు ఉంటుందని జీవోలో స్పష్టం చేసింది. ఒకేవేళ ఫీజులు పెరిగితే ప్రభుత్వం నిర్ణయం మేరకే చెల్లించాల్సి ఉంటుందని జోవోలో స్పష్టం చేసింది. ఈ మేరకు 2010 సెప్టెంబర్ లో జారీ చేసిన జీవో 66ను సవరణ చేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more