Cpi narayana comments on congress party

CPI Narayana Comments On congress party, Telangana Issue, Nagarayana, Congress Party, CM ,

CPI Narayana Comments On congress party

CPI.gif

Posted: 09/01/2012 04:33 PM IST
Cpi narayana comments on congress party

CPI Narayana Comments On congress party

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాక కుక్కను ముఖ్యమంత్రి చేసినా ఫర్వాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. సీపీఐ తెలంగాణ పోరుయాత్రలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన పలుసభ ల్లో, అంతకుముందు మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కాలయాపన చేస్తూ తెలుగుప్రజల మధ్య విద్వేషాలు సృష్టిం చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణతో పెట్టుకుంటే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. ఎర్రజెండా ద్వారానే రాష్ట్రం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రులను మార్చినంత మాత్రాన అవినీతి అంతం కాదన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులను కాపాడేందుకే యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులపై భారం పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. శిశుమరణాలన్నీ సర్కారీ హత్యలేనని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jwala gutta takes indefinite break
Brother and sister agriculture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles