Husband harassed by wife

husband harassed by wife,Warangal, Anusha, Uday sandeep kumar, Engineer, 7 lakhs, gold,

husband harassed by wife

husband.gif

Posted: 08/31/2012 01:50 PM IST
Husband harassed by wife

husband harassed by wife

భర్తతో కలసి ఏడడుగులు నడిస్తే, జీవితాంతం తోడుగా ఉంటాడనుకుంది ఆ యువతి. అయితే అతడు భర్త కాదని ఆ రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని పెళ్లయిన కొద్దిరోజులకే గ్రహించింది ఆ అభాగ్యురాలు. భర్త పెడుతున్న చిత్రహింసలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. మరో మార్గం లేక ఆమె పత్రికలవారిని ఆశ్రయిం చడంతో ఆ శాడిస్టు చర్యలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన అనూషకు ఆరు నెలల క్రితం పిండి ఉదయ్ సందీప్ కుమార్‌తో వివాహం జరిగింది.వివాహానికి ముందు ఉదయ్ సివిల్ ఇంజనీర్ అని పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. రూ.7 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చి అత్తగారింటికి వచ్చిన అనూషకు అసలు విషయం తెలియడంతో నిర్ఘాంతపోయింది. ఉదయ్ పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ నిత్యం వేధించడం మొదలుపెట్టాడు.

husband harassed by wife

మరోవైపు అత్త అనురాధ అదనంగా మరో రూ. 3 లక్షలు కట్నంగా తీసుకురమ్మని వేధిస్తుండేది. అన్ని బాధలను దిగమింగుతూ మౌనంగా భరిస్తున్న అనూషపై ఉదయ్ ఆగడాలు అడ్డులేకుండా పోయాయి. చివరికి తనకు డబ్బు సమకూర్చేందుకు వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేసేసరికి అనూషను తట్టుకోలేక పోయింది. భర్తకు అత్త కూడా వంతపాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉదయ్ ఆగడాలు శృతిమించాయి. బ్లేడ్లతో కోయడం, సిగరెట్లుతో కాల్చడం వంటి పైశాచిక చర్యల ఉదయ్ పాల్పడేవాడని అనూష విలేకరుల ముందు కన్నీరు మున్నీరైంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor esl narasimhan injured
Mother kills sons before committing suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles