Kasabs death sentence upheld

Kasabs death sentence upheld by Supreme Court,Ajmal Kasab, death, sentence, upheld, Supreme Court,Mumbai attacks, Kasab, Pakistan , terrorist, judgement, investigation, death sentence, bombay high court

Kasab's death sentence upheld by Supreme Court

Kasab.gif

Posted: 08/29/2012 03:45 PM IST
Kasabs death sentence upheld

Kasab's death sentence upheld by Supreme Court

ముంబయి పేలుళ్ల నిందితుడు కసబ్‌కు మరణశిక్ష తప్ప మరో శిక్ష లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కసబ్ పిటీషన్‌పై అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న అజ్మల్‌ కసబ్‌కు ఉరే సరి అంటూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో సజీవంగా దొరికిన కసబ్, అప్పటినుంచి ముంబై ఆర్థర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చాలని కసబ్‌ పెట్టుకున్న పిటిషన్‑ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ముంబై దాడులకు మూలం పాకిస్తాన్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది.

Kasab's death sentence upheld by Supreme Court

ఈ కేసు కోసం 11వేల పేజీల భారీ చార్జ్‌షీట్‌ను తయారు చేశారు. కేసు విచారణకు సంబంధించి 30 మంది సాక్షం చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరపున ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నిగమ్‌ నాయకత్వం వహించారు. కసబ్‌ కేసులో సుప్రీం కోర్టు సరైన తీర్పునిచ్చిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నిగమ్‌ అన్నారు. ఉగ్రవాదంలో కేసులో అత్యంత త్వరగా విచారణ జరిగిన కేసు కసబ్‌దే. కసబ్‌ కేసుపై ప్రత్యేక కోర్టు 13 నెలల పాటు విచారణ జరిపింది. కసబ్‌ విచారణకు ముంబై ఆర్థర్‌ జైలులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కోర్టులో 658 మంది వాంగ్మూలం ఇచ్చారు. 2009, ఏప్రిల్‌ 15న, కసబ్‌ కేసు విచారణ ప్రారంభమైంది. దాడులకు పాకిస్తాన్‌లో కుట్ర, ముంబైలో విధ్వంసం జరిగినట్లు సుప్రీంకోర్టు నిర్థారించింది. భారతదేశంపై కసబ్ దాడికి తెగబడటం ప్రాథమిక నేరంగా సుప్రీంకోర్టు పరిగణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao fire on police
Kavitha meet chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles