Motherdaughter suicide attempt at kakinada

Mother,Daughter Suicide Attempt at Kakinada, kakinada, police, mother and daughter, bhaskar nagar, srikanth,

Mother,Daughter Suicide Attempt at Kakinada

Woman.gif

Posted: 08/28/2012 10:18 AM IST
Motherdaughter suicide attempt at kakinada

Mother,Daughter Suicide Attempt at Kakinada

వరకట్నం వేధింపుల కేసులో  న్యాయం దక్కలేదంటూ  ఇద్దరు మహిళలు  వాటర్ ట్యాంక్ ఎక్కిన  ఘటన  కాకినాడలో  చోటుచేసుకుంది. పోలీసులు న్యాయం చేయలేదంటూ ఓ తల్లి తన కూతురు, మనవరాలితో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దూకుతానంటూ బెదిరింపులకు దిగింది. కాకినాడలోని భాస్కర్ నగర్‑లో జరిగిన ఈ ఘటన ఈరోజు ఉదయం పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. పెదపూడికి చెందిన విఘ్నేశ్వరి కూతురు రామతులసికి కాకినాడకు చెందిన శ్రీకాంత్‌తో 2009లో పెళ్లయింది. ఆడపిల్ల పుట్టడంతో తులసిని శ్రీకాంత్ పుట్టింటి వద్దే వదిలేశాడు‌. విడాకులు కావాలంటూ ఒత్తిడి చేయటంతో పోలీసులను ఆశ్రయించిన తులసికి అక్కడా అన్యాయమే జరిగింది. కళ్లముందే తన కూతురి బతుకు అన్యాయం అన్యాయం అయిపోతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ విఘ్నేశ్వరి...కూతురు మనవరాలితో వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఫిర్యాదు చేసిన కేసుపై ఎస్‑ఐ స్పందించకుండా తమను వేధిస్తున్నారంటూ వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే పైనుంచి దూకుతామంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. జిల్లా ఎమ్మెల్యే, ఎస్పీ వచ్చేవరకూ పైనుంచి దిగేది లేదంటూ వారు స్పష్టం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leaders arrested
Grilled meat increases the risk of diabetes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles