Juvvadi gowtham rao passed away

rominent Literary gaint Juvvadi Goutham Rao passed away. He belongs to Karimnagar district

rominent Literary gaint Juvvadi Goutham Rao passed away. He belongs to Karimnagar district

Juvvadi Gowtham Rao passed away.png

Posted: 08/25/2012 01:03 PM IST
Juvvadi gowtham rao passed away

Juvvadi-Gowtham-Raoతన కావ్య గానంతో ప్రజల్ని మంత్ర ముగ్దుల్ని చేసి, జీవితమంతా సాహితీ అధ్యయనంతో గడిపిన సాహితీ వేత్త జువ్వాడి గౌతం రావు (83) కరీంనగర్ లో కన్నుమూశారు. ఈయన మరణంతో ఒక్కసారిగా సాహితీ లోకం శోకసముద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన నిన్న సాయత్రం మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

1929 ఫిబ్రవరి 2వ తారీఖున కరీంనగర్ జిల్లా ఇరుకులలో జన్మించారు.  1947 ఏప్రిల్ లో ఉస్మానియా యూనివర్శిటీలో బీకాం చదువుతుండగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. స్వాతంత్య్ర పోరాటంలో యోధుడిగా పని చేసిన ఆయన సోషలిస్టుగా పరిణతి చెందారు. ప్రగతిగామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొని ఆ స్కూల్ ఆఫ్ థాట్‌కు తనను తాను పరిమితం చేసుకున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేకుండానే ఎన్నికల్లో జనతా పార్టీ పక్షాన 1977లో పోటీ చేసి ఓడిపోయారు.  ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్యపీఠం ఆయనకు అంకితం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yarlagadda lakshmiprasad blames chandrababu on ntr statue
Shooting at the empire state building  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles