Chiranjeevi as new pcc chief

Chiranjeevi, botsa satya narayana, Rajyasabha member, megastar, sonia ghandi,

ICC chief Sonia Gandhi and many union leaders are keen about replacing Botsa Satyanarayana from PCC chief post with Megastar Chiranjeevi, actor turned politician. Reports say, AICC is working on this after the recent by-poll disaster where YS Jagan Mohan Reddy clean swept the assembly seats in seemandhra.

Chiranjeevi as new PCC Chief.png

Posted: 08/24/2012 10:24 AM IST
Chiranjeevi as new pcc chief

Chiranjeeviరాష్ట్రంలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని గత కొన్ని రోజుల నుండి ఊహాగానాలు వస్తున్న విషయం తెలసిందే. వీటికి ఊతమిస్తూ ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రి ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాత్రికి రాత్రే పదవి రావచ్చు, రాత్రికి రాత్రే పదవి పోవచ్చు. దానికి చక్కటి ఉదహారణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇలాంటివి కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య.

ఇక ఇఫ్పుడు ఢిల్లీ రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవికి పీసీసీ పదవి దక్కవచ్చని రకరకాల వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఎఐసిసి అధినేత్రి తో సహా పలువురు ప్రముఖులతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీ అని చిరు మొన్ననే ప్రకటించారు. ఇక పీసీసీ పదవి నుండి బొత్సను తప్పిస్తే కాపు వర్గానికి చెందిన నేతకు అప్పగిస్తే, తరవాత ముఖ్యమంత్రిని మార్చి, వేరే ప్రాంతం వారికి పదవి కట్టబెట్టినా పెద్దగా సమస్య రాదని భావించే చిరంజీవికి ఈ పదవి కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చేందుకు పిసిసి చీఫ్ పదవిని కట్టబెట్టి ఎన్నికల బాధ్యతను పూర్తిగా చిరంజీవిపై మోపాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు చిరంజీవి వర్గం కూడా సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎంతో కాలం నుండి చిరంజీవి ఏదో ఒక పదవి ఇస్తామని ఊరిస్తున్న కేంద్రం మరి ఈసారైనా పీసీసీ పదవి కట్టబెడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran midnight ahmed patel
Pcc chief botsa out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles