Rail engine found after few months

Railway officers found Rail Engine at Kalyani of Mumbai central railway, which is disappeared before four months

Railway officers found Rail Engine at Kalyani of Mumbai central railway, which is disappeared before four months

Rail Engine Found After Few Months.png

Posted: 08/22/2012 04:34 PM IST
Rail engine found after few months

rail-engineగత నాలుగు నెలల క్రితం నుండి ఓ గూడ్స్ రైలు ఇంజన్ కనిపించడం లేదని కాజిపేట రైల్వే కార్యాలయం వారు నోటీస్ బోర్డులో ఓ ప్రకటన అంటించి అందరిని ఆశ్చర్యపరిచిన ఆ రైలు ఇంజన్ జాడ ఎట్టకేలకు తెలిసింది. సికింద్రాబాద్ డివిజన్‌కు ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు చెందిన లోకో నెంబర్ 24039/డబ్ల్యుఏజి5/జిహెచ్ఎస్ విద్యుత్ ఇంజన్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం 60 రోజుల అనంతరం గూడ్స్ ఇంజన్ తిరిగి ఝాన్సీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఇంజన్ ఎక్కడ ఉందో అధికారులు గుర్తించలేక పోయారు.

ఈ క్రమంలో ఇంజన్‌ను గుర్తించమని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ కార్యాలయం నుంచి కాజీపేట డ్రైవర్ల కార్యాలయానికి నోటీసులు అందాయి. ఈ విషయం మంగళవారం మీడియాలో రావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్, మధ్య రైల్వే ముంబయి అధికారులు అన్ని సెక్షన్లలో ఆరా తీయగా... ముంబయి సెంట్రల్ రైల్వేలోని కల్యాణిలో గుర్తించారు. అనంతరం ఇంజన్‌ను నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు అప్పగించారు. ఇంజన్ దొరకడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hema malinidharmendra is king of romance
Doctor dies in accident on orr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles