Tdp leaders attitude

tdp leaders attitude

tdp leaders attitude

25.gif

Posted: 08/19/2012 05:37 PM IST
Tdp leaders attitude

        టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ పార్టీ నేతల్లో విశ్వాసాన్ని ప్రోది చేయలేకపోతున్నారు. భవిష్యత్ పై chandra_babuఆందోళనతో నేతలు ఓక్కొక్కరుగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలోనూ వేరేపార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఉప ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఈయన తరువాతి గమ్యం కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన తన అనుచరులతో, కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. వంటేరుకు కాంగ్రెస్ కు మధ్య  ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…ఈ నెల 20, 21 తేదీల్లో వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంటేరు ఇంతటిలో ఆగక తనతో పాటు మరికొందరు టీడీపీ నాయకులను కాంగ్రెస్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా టీడీపీ vanteruఅధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో విబేధాల కారణంగానే వంటేరు పార్టీని వీడుతున్నాడని  సమాచారం. మొన్నటి నెల్లూరు ఎంపీ ఉప ఎన్నికల్లో వంటేరు తెలుగుదేశం తరపున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయాడు. అప్పుడే వంటేరు కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బరామిరెడ్డితో కుమ్మకు అయినట్టు వార్తలు వచ్చాయి.  ఇప్పుడు ఇలా వంటేరు కాంగ్రెస్ జెండా ఎగరేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంటేరు రాజీనామా జిల్లా టీడీపీని ఏ మేరకు బలహీన పరుస్తుంది, ఈ పరిణామం కాంగ్రెస్ కు ఎంతోకంత లాభించే అవకాశమే ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actor naresh fire on state govt
There and here corruption  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles