Small baby

small baby, 10 years surakshya , Sainadh more, Two persons, Police , Nasic

small baby

small baby.gif

Posted: 08/18/2012 10:48 AM IST
Small baby

smallbaby

ఓ పదేళ్ల చిన్నారి ఆటలు ఆడుకుంటు లీనమైపోయింది. తన ఇంటి ముందు  స్వేచ్చగా ఆ చిన్నారి ఆడుకుంటుంది. ఆ చిన్నారి చురుకుతనంతో  ఒక నవ శిశువు కు ప్రాణం పోసింది.  ఆ చిన్నారి పేరు సురక్ష్యా  రోజులాగే తన ఇంటి ముందు  ఆడుకుంటోంది.  ఇంతలో ఇద్దరు  వ్యక్తులు  మోటార్ సైకిల్ పై  అక్కడికి వచ్చి .. హడావుడిగా  దగ్గర్లోనే ఉన్న ఖాళీ స్థలం వద్దకు వెళ్లి  ఒక గుంట తీసి .. తమ వెంట తీసుకొచ్చిన చిన్న పాపను  ఆ గుంటలో  పూడ్చేసి .. అక్కడినుండి హడావుడిగా  పారిపోయారు. ఈ విషయాన్ని  అక్కడే ఆడుకుంటున్న  సురక్ష్యా  చూసింది. కానీ ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్లు అక్కడ ఏం చేశారు అనే ఆలోచన రావటంతో   ఆ చిన్నారి అడుగులు  ఆ గుంటవైపు నడిచాయి. ఇంతలో   ఆ గుంట లోపలి నుంచి  పాప ఏడుపులు వినిపించాయి.  వెంటనే అప్రమత్తమైన  సురక్ష్యా .. మెరుపు వేగంతో  పరుగెత్తి కెళ్లి తన ఇంట్లో ఉన్న  ఆ చిన్నారి నాన్నకు  విషయం చెప్పింది.  అతను వెంటనే  ఆ గుంట దగ్గరకు చేరుకొని ..  పాపను బయటకు తీసి ..  వెంటనే  విషయాన్ని  పోలీసులకు తెలిపారు.  ఆయన జిల్లా పరిషత్ సభ్యుడు అయిన  సాయినాథ్  మోరే . ఇంతలో  స్థానికులు రావడంతో  మట్టికొట్టుకుపోయి కొన ఊపిరితో ఉన్న ఆడశిశువును  స్థానిక ఆరోగ్య కేంద్రానికి  తరలించి  చికిత్స చేశారు.  ఇప్పుడా  పాపను నాసిక్  సివిల్  ఆసుపత్రిలో  ఇంక్యుబేటర్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.  పాప ఆరోగ్య పరిస్థితి  నిలకడగా  ఉందనీ .. మెల్లగా  కోలుకుంటోందని  వైద్యులు తెలిపారు.  పోలీసులు కేసు  నమోదు చేసుకుని  దర్యాప్తు  చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Japanese man 106 breaks travel record on public transport
Earthquake rumor at adilabad dist public ran out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles