Nasa and boeing test radical triangular plane

Science,Technology,Video Games,Space,Personal Technology,Internet,Geography,Environment,Computing

NASA yesterday took a scale replica of the plane for a test fly, and hopes the plane will become the next universally adopted design within the next two decades

Nasa and Boeing test radical triangular plane.png

Posted: 08/10/2012 07:51 PM IST
Nasa and boeing test radical triangular plane

triangular_planeటెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెద్దగా ఉండే వస్తువులను చిన్నగా మారుస్తున్నారు. చిన్నగా ఉండే వస్తువులను మైక్రో వస్తువులుగా మారుస్తున్నారు. కానీ ఎప్పటి నుండో ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉన్న విమానాలను మార్చలేదు. ఆలోటు కూడా త్వరలో తీరబోతుందంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. ప్రస్తుతం గొట్టం లాగా ఉండే విమానాల రూపురేఖలను మార్చేయనున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న విమానాలు మరో 10 – 15 సంవత్సరాల్లో కనిపించకుండా పోతాయంటున్నారు.  త్రిభుజాకారంలో ఉండే విహంగాలు రాబోతున్నాయి. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా విమనయాన దిగ్గజం బోయింగ్ తో కలిసి ఎక్స్ 48 అనే భవిష్యత్తు తరం విమానాన్ని రూపొందిస్తుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ బరువు మోసే సామార్థ్యాన్ని కలిగి ఉండేలా దీనిని డిజైన్ని తీర్చిదిద్దటం విశేషం. నాసా ఇప్పటికే ఎక్స్ - 48బీ అనే నమూనాను పరీక్షగా దానికి మరిన్ని మెరుగులు దిద్ది ఎక్స్ - 48సీ రకాన్ని తయారు చేసింది. ఇది తాజాగా కాలిఫోర్నియాలోని డ్రైడెన్ విమాన పరిశోధన కేంద్రం నుండి గగన విహారం చేసింది. రిమోట్ కంట్రోల్ సాయంతో పై కెగిరిన ఈ త్రికోణ విమానం 9 నిమిషాల పాటు గగన విహారం చేసింది. దీని ఆధారంగా భవిష్యత్తులో పూర్తి స్థాయి విమామాన్ని తయారు చేస్తామని వెల్లడించారు.

కానీ విమానంలో కిటీకీ ప్రక్కన కూర్చొని ప్రయాణం చేయాలనుకునే వారికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే దీని డిజైన్ ఆధారంగా అందులో కిటికీలు ఉండవు. వచ్చే 15 – 20 ఏళ్ళలో ఇది ప్రయాణికుల, సైనికావసరాలకు పనికొస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yoga can reduce depression in pregnant women as well
Curiosity and the mojave desert of mars  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles