సంచలనం సృష్టించిన నీలిమ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో పలు కొత్త అంశాలు వెలుగుచూడటంతో నీలిమ చావు వెనుక ఉన్న రహస్యాలు ఏమై ఉంటాయన్న దానిలో కొంత మేర స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయదుర్గం పోలీసులు నీలిమ ఈ-మెయిల్‌ను బ్రేక్ చేసిన నేపథ్యంలో ఆమె స్నేహితుడి వివరాలు బయటపడంతో పాటు పాలు ఆశక్తికర అంశాలు బట్టబయలయ్యాయి. ఇదిలా ఉండగా, మంగళవారం గచ్చిబౌలి కార్యాలయానికి రమ్మని తామెవరూ నీలిమకు వర్తమానం పంపలేదని ఇన్ఫోసిస్ సంస్థ పోలీసులకు స్పష్టం చేసింది. నీలిమే స్వచ్ఛందంగా వచ్చారని, ఆమె వద్ద యాక్సెస్ కార్డు ఉండటంతో తేలిగ్గా లోపలికి రాగలిగారని పేర్కొంది. నీలిమ ఆఫీసుకు వచ్చినా.. పాత మిత్రుల్లో ఎవరినీ కలవలేదని తెలిసింది.
కార్యాలయం భవనంలోకి రాత్రి 9.00 గంటలకు ప్రవేశించిన నీలిమ.. 9.36 గంటల వరకూ అందులోని వివిధ అంతస్తుల్లో తిరిగి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. పార్కింగ్ భవనంలో నీలిమ 53 నిమిషాల సేపు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తన సెల్‌ఫోన్ నుంచే మెయిల్ యాక్సెస్ చేసిన నీలిమ.. భర్తకు, ప్రశాంత్‌కు అక్కడి నుంచే ఈ మెయిల్స్ టైప్ చేసి పంపారని చెబుతున్నారు. తెలుగు పదాలను స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో ఆంగ్లంలో కంపోజ్ చేశారని.. అందుకే అక్కడ అంత ఎక్కువ సమయం పట్టిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. భర్తకు పంపిన ఈ మెయిల్‌లో పైన చెప్పిన వివరాలతో పాటు తన బంగారాన్ని కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? తాను ఎవరికి ఎంత డబ్బు చెల్లించాలి? తదితర అంశాలతో పాటు ఇంటి పరిస్థితి, తనకున్న చిట్స్ వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌కు పంపిన మెయిల్‌లో మాత్రం.. ‘నీకు ఈ జన్మలో సేవ చేయలేకపోతున్నాను’ అన్నట్లు రాసి ఉందని చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌లోని ఘటనాస్థలిని మరోసారి పరిశీలించిన దర్యాప్తు అధికారులు అత్యంత కీలకమైన క్రైమ్ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్(నేర స్థలి పునర్
నిర్మాణం) పూర్తి చేశారు. ఇందులో తమకు సందేహించదగ్గ ఎలాంటి సందర్భాలూ ఎదురుకాలేదని వారు పేర్కొంటున్నారు. చివరి ఫోన్‌కాల్ ప్రశాంత్‌కు: నీలిమ తన సెల్ నుంచి చివరగా ప్రశాంత్‌కు ఫోన్ చేసి.. 2 నుంచి 3 నిమిషాలపాటు మాట్లాడినట్లు తేలింది. నీలిమ ఫేస్‌బుక్‌లోని వివరాల ఆధారంగా ఆమె నగరంలోని షాదన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(2006)తో పాటు విశాఖపట్నంలోని నలంద జూనియర్ కాలేజీ (2002)లోనూ విద్యనభ్యసించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రశాంత్ ఆమెకు బాల్య స్నేహితుడని భావిస్తున్నారు. అతడు అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియలేదని, త్వరలోనే అతడి నుంచీ వాంగ్మూలం నమోదు చేస్తామని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ బాలకోటి తెలిపారు. నీలిమ భర్త సురేష్‌రెడ్డి, మామ, మరో ఇద్దరు యువకులు నిన్న ఉదయం సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. కమిషనర్ సూచన మేరకు వారంతా మాదాపూర్ డీసీపీ యోగానంద్‌తో మాట్లాడారు. ఇవాళ (ఆదివారం) నీలిమ కుటుంబీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది. వీరందరి నుంచి వివరాలు సేకరించిన తరవాత నీలిమ అనుమానాస్పద మృతిపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more